Homeజిల్లాలుఅనంతపురంఉచిత వైద్య శిబిరంలో విశ్రాంత ఉద్యోగులకు పరీక్షలు

ఉచిత వైద్య శిబిరంలో విశ్రాంత ఉద్యోగులకు పరీక్షలు

- Advertisement -

విశాలాంధ్ర, కళ్యాణదుర్గం.. వివిధ రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న విశ్రాంత ఉద్యోగుల కోసం గురువారం అనంతపురం కిమ్స్ సమీరా హాస్పిటల్ మరియు విశ్రాంత ఉద్యోగుల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో గుండె, కంటి వైద్య శిబిరం నిర్వహించారు. కళ్యాణదుర్గం విశ్రాంత ఉద్యోగుల భవన్ లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగిన ఈ శిబిరంలో పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ శిబిరంలో సుమారు రూ.2,000 విలువైన వివిధ రకాల వైద్య పరీక్షలను పూర్తిగా ఉచితంగా అందించారు. ప్రధానంగా షుగర్, బీపీ పరీక్షలు ఈసీజీ , టూ-డి ఎకో వంటి గుండె సంబంధిత పరీక్షలు నిర్వహించారు. మొత్తం 97 మంది విశ్రాంత ఉద్యోగులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని వైద్యుల సలహాలు పొందారు. కిమ్స్ సమీరా హాస్పిటల్‌కు చెందిన వైద్యులు ఆది శేషు, నూర్ మహమ్మద్, రాము తదితరులు రోగులను క్షుణ్ణంగా పరీక్షించి అవసరమైన జాగ్రత్తలు సూచించారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మల్లికార్జున, తిప్పేస్వామి, పూర్వాధ్యక్షులు శివప్రసాద్, కృష్ణయ్య చౌదరి, అలాగే అంజనప్ప, ఇస్మాయిల్, భగవాన్దాస్, వన్నూరు స్వామి, పాండురంగ, గంగప్ప తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు