విశాలాంధ్ర, కళ్యాణదుర్గం.. గత ప్రభుత్వ హయాంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ని అక్రమంగా అరెస్టు చేసి జైలులో నిర్బంధించిన సమయంలో, ఆయన క్షేమంగా విడుదలైతే హైదరాబాద్ నుంచి తిరుపతి వరకు పాదయాత్ర చేస్తానని సినీ నిర్మాత బండ్ల గణేష్ మొక్కుకున్నారు. తన మొక్కును తీర్చుకునేందుకు బండ్ల గణేష్ ‘సంకల్పయాత్ర’ను చేపట్టారు. ఈ సంకల్పయాత్రలో భాగంగా టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, కళ్యాణదుర్గం యువ నాయకుడు ఉన్నం మారుతి చౌదరి బండ్ల గణేష్‌ను కలుసుకుని సంఘీభావం తెలిపారు. అనంతరం ఆయనతో కలిసి పాదయాత్రలో పాల్గొని తన మద్దతును ప్రకటించారు. ఈ సందర్భంగా మారుతి చౌదరి మాట్లాడుతూ, ప్రజల మనసుల్లో చెరగని స్థానం సంపాదించుకున్న చంద్రబాబు నాయుడు పై జరిగిన అన్యాయాన్ని ప్రజలు ఎప్పటికీ మర్చిపోరని, ఈ సంకల్పయాత్ర ప్రజాస్వామ్య విలువలకు ప్రతీకగా నిలుస్తుందన్నారు.


