Homeజిల్లాలుఅనంతపురంఘనంగా వసంత పంచమి వేడుకలు

ఘనంగా వసంత పంచమి వేడుకలు

- Advertisement -

విశాలాంధ్ర – జేఎన్టీయూ ఏ: అనంత లక్ష్మి ఇంటర్నేషనల్ స్కూల్‌లో వసంత పంచమి వేడుకలను పురస్కరించుకుని విద్యాధిదేవత అయిన సరస్వతీ దేవి పూజను అత్యంత వైభవంగా నిర్వహించారు. పాఠశాల ఛైర్మన్ అనంత రాముడు జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు.
వసంత పంచమి శుభ సందర్భాన్ని పురస్కరించుకుని చిన్నారులతో అక్షరాభ్యాసం చేయించారు. సరస్వతీ కటాక్షంతో విద్యార్థులంతా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన ఈ సందర్భంగా ఆకాంక్షించారు.
విద్యార్థులలో జ్ఞానాన్ని, క్రమశిక్షణను పెంపొందించడంలో వసంత పంచమి వంటి పర్వదినాలు స్ఫూర్తినిస్తాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల సీఏఓ నరసింహారావు, ప్రిన్సిపాల్ , ఉపాధ్యాయ బృందం , విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు