విశాలాంధ్ర – మండపేట : మండపేట పట్టణంలో మున్సిపల్ కార్యాలయం వద్ద శనివారం జరిగిన స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమంలో రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సంధర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశం మొత్తం స్ఫూర్తినిచ్చేలా స్వచ్ఛభారత్ కార్యక్రమం నడుస్తోందని చెప్పారు. ప్రజల భాగస్వామ్యంతో ఏ కార్యక్రమం చేసినా అది శాశ్వతంగా ఉంటుందని, ప్రజల జీవన ప్రమాణాల్లో మార్పు వస్తుందని అన్నారు. పరిసరాల పరిశుభ్రతే కాదు, ఆలోచనలు కూడా స్వచ్ఛంగా ఉండాలని చెప్పారు. ప్రతీ ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచడమే స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర లక్ష్యం అన్నారు. ఇందులో ప్రతీ పౌరుడు భాగస్వామి కావాలన్నారు. అనంతరం స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర ర్యాలీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, మున్సిపల్ అధికారులు, ఆర్.పి లు, తదితరులు పాల్గొన్నారు….
స్వర్ణాంధ్ర – స్వచ్చాంధ్ర కార్యక్రమంలో…ఎమ్మెల్యే వేగుళ్ళ
- Advertisement -
RELATED ARTICLES


