అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన నేపథ్యంలో చెల్లించినట్లు ఇన్సూరెన్స్ వర్గాలు వెల్లడి
అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన నేపథ్యంలో విమానయాన సంస్థ ఎయిరిండియా (AirIndia) కు పలు బీమా కంపెనీలు, రీఇన్సూరర్ల నుంచి పరిహారం అందింది. ఎయిర్‌లైన్‌కు రూ.1,100 కోట్లకు పైగా చెల్లించినట్లు ఇన్సూరెన్స్ వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు ఆంగ్ల మీడియా కథనం ఈ మేరకు పేర్కొంది.గతేడాది జూన్ 12న అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన ఎయిరిండియా ( (Airindia) డ్రీమ్‌లైనర్ విమానం.. టేకాఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే కుప్పకూలింది. అది ఒక మెడికల్ కాలేజీ హాస్టల్‌పై పడింది. ఈ ఘటనలో విమానం తునాతునకలైంది. అది పూర్తిగా ధ్వంసం కావడంతో బీమా కంపెనీలు, రీఇన్సూరర్లు 125 మిలియన్ డాలర్లు (రూ.1,100 కోట్లకుపైగా) బీమా మొత్తాన్ని చెల్లించాయి. అలాగే ప్రమాదంలో మరణించిన మృతుల బంధువులకు 25 మిలియన్ డాలర్ల పరిహారం చెల్లించే ప్రక్రియ మొదలైనట్లు ఆ సంస్థలు పేర్కొన్నాయి. అయితే ఆ ప్రక్రియ ఇంకా పూర్తికాలేదని, ఆ మొత్తం పెరిగే అవకాశం ఉందని వెల్లడించాయి. ఘటన సమయంలో విమానంలో 242 మంది ఉండగా.. ఒకే ఒక్క వ్యక్తి మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. విమానం హాస్టల్‌పై పడటంతో మరికొందరు ప్రాణాలు కోల్పోయారు. వీరి కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించేలా టాటా గ్రూప్ ఒక ట్రస్ట్‌ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
ఎయిరిండియాకు రూ.1,100కోట్ల బీమా సొమ్ము..
- Advertisement -


