- Advertisement -
విశాలాంధ్ర–ఉరవకొండ: ఉరవకొండ జిల్లా జాయింట్ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన సి. విష్ణు చరణ్ ఆదివారం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ను ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.ప్రస్తుతం ఇంచార్జ్ కలెక్టర్ బాధ్యతలు కూడా నిర్వహిస్తున్న విష్ణు చరణ్‌తో జిల్లా పరిపాలనకు సంబంధించిన వివిధ అంశాలపై మంత్రి చర్చించినట్లు తెలిసింది. జిల్లా అభివృద్ధి కార్యక్రమాలు, అమలులో ఉన్న పథకాల పురోగతి తదితర విషయాలపై సమీక్ష జరిపినట్లు సమాచారం.


