Homeజిల్లాలుఅనంతపురంముద్దాయి లకు అన్ని వసతులు కల్పించాలి

ముద్దాయి లకు అన్ని వసతులు కల్పించాలి

- Advertisement -

సీనియర్ సివిల్ జడ్జ్, మండల న్యాయ సేవ అధికార సంస్థ చైర్మన్ టి. వెంకటేశ్వర్లు

విశాలాంధ్ర – ధర్మవరం; పట్టణంలోని సబ్ జైల్లో గల ముద్దాయిలకు అన్ని వసతులు కల్పించేలా సబ్జైలర్ తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలని సీనియర్ సివిల్ జడ్జ్ మండల న్యాయ సేవ అధికార సంస్థ చైర్మన్ టి. వెంకటేశ్వర్లు తెలిపారు. అనంతరం జడ్జి ఆకస్మికంగా సబ్ జైలును తనిఖీ చేశారు. ఖైదీలు ఉండే గదులు పరిశీలించారు, తదుపరి ఖైదీలకు పెట్టే భోజనంను స్వయంగా వారు రుచి చూశారు.
నాణ్యత లేకపోవడంతో వారు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. త్రాగునీటిని పరిశీలించారు. అంతేకాకుండా ఖైదీల ఆరోగ్య పరిస్థితిని, సమస్యలను అడిగి తెలుసుకున్నారు, ఉచిత న్యాయవ్యవస్థ అందరికీ ఏర్పాటు చేస్తుందని తెలిపారు. ప్రతి వారంలో శనివారం తప్పనిసరిగా వైద్యులను పిలిపించి రోగులకు వైద్య చికిత్సలను అందించాలని వారు ఆదేశించారు. అదేవిధంగా బెయిల్ గురించి ఖైదీలకు, చట్టాలు గూర్చి వారి వివరించారు. సబ్ జైల్లో ఉంటూ బేల్స్ రానివారికి తగిన మార్గదర్శనం కూడా వారు తెలియజేశారు. చట్టాల పరిధిలోనే అన్ని వర్తిస్తాయని తెలిపారు. తదుపరి 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఖైదీలకు, సబ్ జైలు సూపర్డెంట్ కు, సిబ్బందికి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు బాలసుందరి ,బిల్లే రవి, కృష్ణమూర్తి, శంకర్, ఎమ్మెల్సీ స్టాఫ్ మురళి, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు