విశాలాంధ్ర – కడియం : తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ కడియం మండలం వేమగిరి జాతీయ రహదారిపై సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందగా కుటుంబ సభ్యులు గాయాల పాలైనట్లు కడియం మహిళా ఎస్సై ధనలక్ష్మి ప్రసన్న తెలిపారు. గత ఐదు సంవత్సరాలుగా కడియం మండలం, వేమగిరి గ్రామంలో నివాసముంటున్న చిట్టూరి వెంకటేష్ (38) అనే వ్యక్తి, తన భార్య, ఇరువురు చిన్నారులతో కలిసి స్వగ్రామమైన రావులపాలెం దగ్గర కేదారశెట్టి పాలెం గ్రామానికి ద్విచక్ర వాహనం పై బయలుదేరాడని, స్థానికం గా ఉన్న ఒక నర్సరీలో మొక్కలు కొనుగోలు చేసి, తన వాహనంపై జాతీయ రహదారి ఎక్కుతుండగా, అటుగా వెళుతున్న కారు ఢీకొనడంతో చిట్టూరి వెంకటేష్ అక్కడికక్కడే మృతి చెందినట్లు ఆమె తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆమె తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
- Advertisement -
RELATED ARTICLES


