యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శెట్టిపి జయచంద్రారెడ్డి
విశాలాంధ్ర ధర్మవరం: పిఆర్సి ఇతర ఆర్థిక డిమాండ్లపై ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యుటిఎఫ్) ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేపట్టనున్నట్లు యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శెట్టిపి జయ చంద్రా రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్. రామకృష్ణ నాయక్ తెలిపారు.ఈ సందర్భంగా వారు ధర్మవరం పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మాట్లాడుతూ ప్రభుత్వం యొక్క కార్యక్రమాలు, పథకాలు ప్రజలకు చేరువ చేయడంలో రాష్ట్రంలో ఉన్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు అందరూ ఎంతగానో శ్రమిస్తున్నప్పటికీ వారికి రావలసిన, కావలసిన ఆర్థిక ప్రయోజనాలు మాత్రం ఎప్పటికప్పుడు ఇచ్చే పరిస్థితి కనపడడం లేదు అని తెలిపారు.యుటిఎఫ్ డిమాండ్లు లలో పి ఆర్ సి కమిషన్ చైర్మన్ నియమించాలి అని,పెండింగ్ డి ఏ లను మంజూరు చేయాలి అని,29 శాతం మధ్యంతర భృతి ప్రకటించాలి అని తెలిపారు. అంతేకాకుండా ఉద్యోగుల పెన్షనర్ల బకాయిల చెల్లింపునకు రూట్ మ్యాప్ ప్రకటించాలి అని,సిపిఎస్ రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి డిమాండ్ చేశారు.2004 ముందు నియామకం ప్రక్రియ పూర్తి అయిన వారికి పాత పెన్షన్ విధానం అమలు చేయాలి అని తెలిపారు. ఇక ఉద్యమ కార్యా చరణలో పోస్ట్ కార్డుల క్యాంపెయినింగ్, మంత్రులకు ఎమ్మెల్యేలకు అధికారులకు ప్రాతినిధ్యాలు, ప్రభుత్వం స్పందించకపోతే ఫిబ్రవరి 17న ఛలో విజయవాడ నిర్వహిస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి రామకృష్ణ నాయక్, జిల్లా కార్యదర్శి అమర్ నారాయణరెడ్డి, రాష్ట్ర కౌన్సిలర్ మేరీవర కుమారి, జిల్లా కార్యదర్శి నాగేంద్రమ్మ, ధర్మవరం పట్టణ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జింకా హరికృష్ణ, రామాంజనేయులు , లక్ష్మయ్య, రాంప్రసాద్, రఫీ అహ్మద్, ప్రదీప్ , డివి సురేష్, పూజారి రామకృష్ణ, రాజేశ్వరరావు, ఆదిశేషయ్య, అమర్నాథ్ రెడ్డి, వెంకట కిషోర్, బాలగొండ్ల ఆంజనేయులు, గోపాల్ రావు తదితరులు తెలిపారు.


