Homeజిల్లాలువిజయనగరంమజ్జి గౌరీ అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్

మజ్జి గౌరీ అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్

- Advertisement -

విశాలాంధ్ర- రాజాం ( విజయనగరం జిల్లా): ఉత్తరాంధ్ర ఆరాధ్యదైవంగా భక్తుల పాలిట కొంగుబంగారంగా విరాజిల్లుతున్న శ్రీ శ్రీ శ్రీ మజ్జి గౌరీ అమ్మవారి 47వ జాతర మహోత్సవాలు రాజాం మండలం అంతకాపల్లి గ్రామంలో శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ మహోత్సవాలు నేటి నుంచి మూడు రోజుల పాటు వైభవంగా నిర్వహించనున్నారు. జాతర ప్రారంభోత్సవంలో భాగంగా నియోజకవర్గ ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… జాతరకు విచ్చేసే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా కమిటీ సభ్యులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. తాగునీరు, విద్యుత్‌, పారిశుధ్యం, భద్రత వంటి మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు.ఈ జాతరకు వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశమున్నందున అవసరమైన అన్ని ఏర్పాట్లు సమర్థవంతంగా నిర్వహించాలని ఎమ్మెల్యే కోరారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు