Homeజిల్లాలుకర్నూలు100 రోజుల ప్రణాళికను పకడ్బందీగా అమలు చేయాలి

100 రోజుల ప్రణాళికను పకడ్బందీగా అమలు చేయాలి

- Advertisement -

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : పదోతరగతి విద్యార్థులకు 100 రోజుల ప్రణాళికను పకడ్బందీగా అమలు చేయాలని ఆదోని డిప్యూటీ డీఈఓ రాజేంద్ర ప్రసాద్ ఆదేశించారు. శుక్రవారం మండల పరిధిలోని చిన్నతుంబళం, కల్లుకుంట, పెద్దకడబూరు గ్రామాలలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయా పాఠశాలలో పదోతరగతి విద్యార్థులకు అమలవుతున్న 100 రోజుల ప్రణాళికపై సమీక్షించారు. అలాగే పదోతరగతి విద్యార్థులతో ముఖాముఖిగా మాట్లాడారు. చిన్నతుంబళం పాఠశాలలో పదోతరగతి విద్యార్థులకు హిందీ సబ్జెక్టులో సులభంగా మార్కులు ఏఏ అంశాల నుంచి వస్తున్నాయో వాటి గురించి వివరించారు. విద్యార్థులు బాగా కష్టపడి చదివి ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఉపాధ్యాయులు సమయపాలన పాటించి విద్యార్థులకు చక్కగా బోధించి పది పరీక్షల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి – 2 రామ్మూర్తి, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు