Homeజిల్లాలుశ్రీ సత్యసాయిషర్మిలరెడ్డి జిల్లా పర్యటనను జయప్రదం చేయండి

షర్మిలరెడ్డి జిల్లా పర్యటనను జయప్రదం చేయండి

- Advertisement -


కాంగ్రెస్ పార్టీ నాయకులు తుంపర్తి పరమేష్


విశాలాంధ్ర ధర్మవరం:జాతీయ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి లోక్ సభ ప్రతిపక్ష నేత శ్రీ రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షర్మిల రెడ్డి తలపెట్టిన కార్యక్రమం మహాత్మా గాంధీ ఉపాధి హామీ పతకం పరిరక్షణ యాత్ర ఈనెల 4 వ తేదిన షర్మిల రెడ్డి పర్యటన ధర్మవరం నియోజకవర్గం లో ముస్టురు, కొత్తచెరువు జరగబోయే బహిరంగ సభలో పాల్గొంటున్నారు అని కాంగ్రెస్ పార్టీ నాయకులు తుంపర్తి పరమేష్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈకార్యక్రమం దిగ్విజయం చేయవలసిందిగా వారు పిలుపునిచ్చారు. భారతదేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ 2006లో మన నాయకుడు స్వర్గీయ dr వైస్సార్ ప్రవేశ పెట్టిన కార్యక్రమం ఎంజి ఎన్ఆర్ఇజిఎస్ ఇది దేశానికే తలమణికంగా ఉందని తెలిపారు. పెదప్రజల జీవితాన్నే మార్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ అని ఎంజిఎన్ఆర్ఇజిఎస్ పట్ల బీజేపీ వైఖరి నశించాలి అని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాలమీద 40 శాతము ఆర్థికబారం మోపి ప్రజలను ప్రభుత్వాలను అందకారం లోకి తోస్తూ, ఆర్థిక సంక్షోబాన్ని సృష్టిస్తోంది అని తెలిపారు. విధి విధానాలు లేకుండా పతకాల రూపకల్పనతో విధ్వంసకర పరిపాలన చేస్తోంది అని తెలిపారు. కావున ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి , రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటానికి మద్దతుగా నిలబడాలని తెలిపారు. ఈకార్యక్రమంలో ధర్మవరం కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, రాజశేఖరరెడ్డి అభిమానులు పాల్గొనవలసినదిగా వారు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు