Homeజిల్లాలుఅనంతపురండ్రోన్లపై డిగ్రీ విద్యార్థులకు శిక్షణ

డ్రోన్లపై డిగ్రీ విద్యార్థులకు శిక్షణ

- Advertisement -

విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : ఉరవకొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులకు డ్రోన్లు వినియోగంపై శిక్షణ ఇస్తున్నట్లు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఆదినారాయణ తెలిపారు. శుక్రవారం స్థానిక డిగ్రీ కళాశాల ఆవరణలో శిక్షణ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ నేటి ఆధునిక సాంకేతిక యుగంలో డ్రోన్ టెక్నాలజీకి విస్తృతమైన డిమాండ్ ఉందిని
వ్యవసాయం, భూసర్వే, ఫోటోగ్రఫీ, వీడియో గ్రఫీ, డెలివరీ సేవలు, విపత్తుల నిర్వహణ వంటి రంగాల్లో డ్రోన్ల వినియోగం వేగంగా పెరుగుతోందని ఈ నేపథ్యంలో డిగ్రీ కాలేజీ విద్యార్థులకు డ్రోన్లపై ప్రాక్టికల్ శిక్షణ అందించడం ద్వారా స్వయం ఉపాధి, ప్రైవేట్ ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. ఈ శిక్షణ పూర్తిచేసిన విద్యార్థులు డ్రోన్ పైలట్‌లుగా పని చేసే అవకాశాలతో పాటు, స్వంతంగా డ్రోన్ సేవల కేంద్రాలు ఏర్పాటు చేసుకునే వీలుంటుందని ముఖ్యంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఇది మంచి ఉపాధి మార్గంగా మారుతుందని తెలిపారు. ఇప్పటివరకు దాదాపు 160 మంది విద్యార్థులకు డ్రోన్లపై శిక్షణ ఇవ్వడం జరిగింది అన్నారు. అలాగే ఏఐపై కూడా దాదాపు 160 మంది విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం జరిగిందని దీనివల్ల కూడా ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి అన్నారు. టెక్నాలజీ, ఐటీ రంగంలో ఉపాధి అవకాశాలు ఉన్నాయన్నారు. అలాగే సాయిల్ టెస్టింగ్ లో కూడా కళాశాలలో చదువుతున్న 50 మందికి శిక్షణ ఇవ్వడం జరిగిందని వ్యవసాయ రంగంలో ఉపాధి అవకాశాల కోసం ఇది ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. సాయి టెస్టింగ్ ల్యాబ్ లు, రైతులకు సలహాలు సూచనలు తదితర అంశాల్లో ఉపాధి అవకాశాలు ఉన్నాయన్నారు. వీటన్నింటినీ కూడా విద్యార్థులు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకొని ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంపొందించుకోవాలన్నారు. ఈ మూడు అంశాలపై శిక్షణ ఇవ్వడం పట్ల విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్.ఎస్.ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు .డాక్టర్ బి .వెంకట రాముడు, ఎం. పరమేష్,
ఫిజిక్స్ అధ్యాపకులు డాక్టర్, కె.ఎం .రాజేష్, అర్థశాస్త్ర ఉపన్యాసకులు డాక్టర్. అయ్యన్న, గ్రంథాలయ ఉపన్యాసకులు డాక్టర్ .రాజశేఖర్, నాగేంద్ర, ఫిజికల్ డైరెక్టర్ ప్రశాంత్. పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు