వైసిపి చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ఇంటింటికీ తెలియజేయండి:
విశాలాంధ్ర విజయనగరం: వైసిపి చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ఇంటింటికీ తెలియజేయండి. మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల. టౌన్ స్థానిక ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, కుట్రపూరిత రాజకీయాలు కేవలం తెలుగుదేశం పార్టీకే చెందిందని, వైసిపి ప్రభుత్వ హయాంలో ప్రజలకు చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికి తెలియపరచాలని మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి అన్నారు. మంగళవారం తన నివాసంలో విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ సచివాలయ ఇన్చార్జి నియామక కార్యక్రమాన్ని నగర అధ్యక్షులు ఆశపు వేణు అధ్యక్షతన నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మాజీ డిప్యూటీ స్పీకర్, విజయనగర నియోజకవర్గ సమన్వయకర్త కోలగట్ల వీరభద్ర స్వామి మాట్లాడుతూ ప్రస్తుతం విజయనగరం కార్పొరేషన్ పరిధిలో గల అన్ని సచివాలయాల ఇంచార్జ్ ప్రక్రియ పూర్తి చేయడం జరిగిందన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రక్రియ ప్రారంభం జరిగిందన్నారు. సచివాలయ పరిధిలో సుమారు వందమంది సభ్యులను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. వీరంతా గతంలో వైసిపి ప్రభుత్వంలో చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలందరికీ తెలియజేయడం జరుగుతుందన్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా కూటమి ప్రభుత్వ పాలన ఏ విధంగా ఉందో ప్రజలంతా గుర్తిస్తున్నారన్నారు. కుట్రపూరిత రాజకీయాలు మోసపూరిత హామీలు ఇవ్వడం తెలుగుదేశం పార్టీకి కొత్త కాదన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైనా ప్రజల వద్దకు వెళ్లగలరా అని ప్రశ్నించారు. ప్రభుత్వం ఏర్పడి సుమారు రెండు సంవత్సరాలు కావస్తున్న ఒక్క వికలాంగ, వృద్ధ, తదితర పెన్షన్లను ఇవ్వలేదన్నారు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి పెన్షన్లు ఇచ్చిన ఘనత కేవలం వైసీపీకి చెందిందన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత విజయనగరం నియోజకవర్గం ఏ విధంగా అభివృద్ధి చెందిందో ప్రజలందరికీ తెలపాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందన్నారు. అనంతరం నియోజకవర్గ పరిశీలకులు పులి రాజు, నగర మేయర్ వెంపటాపు విజయలక్ష్మి మాట్లాడుతూ కోలగట్ల వీరభద్ర స్వామి ఎమ్మెల్యేగా చేపట్టిన సమయంలో మాత్రమే విజయనగరం అభివృద్ధి చెందిందన్నారు. గతంలో రోడ్ల విస్తరణ పనులపై అనేక సమయంలో స్థానిక ఎమ్మెల్యేలకు తెలిపినప్పటికీ ఉపయోగము లేకుండా పోయిందన్నారు. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా విజయనగరం జిల్లాలోని మాత్రమే మహిళల కోసం ప్రత్యేకంగా పార్కును ఏర్పాటు చేసిన ఘనత కేవలం కోలగట్ల వీరభద్ర స్వామికి మాత్రమే చెందిందన్నారు. ఎస్ వి వి రాజేష్ మాట్లాడుతూ ప్రస్తుతం కూటమి ప్రభుత్వం చేస్తున్న అన్యాయ అక్రమాలను ప్రజలంతా గుర్తిస్తున్నారన్నారు. ప్రతి కార్పొరేషన్ పరిధిలో గల సచివాలయాల్లో ఒక అధ్యక్షున్ని ఎన్నుకొని దానిద్వారా అనుబంధ కమిటీలను పూర్తిస్థాయిలో ఏర్పాటు చేస్తామన్నారు. దీని ద్వారా సచివాలయానికి సుమారు 100 మంది సభ్యులు పార్టీ కోసం కృషి చేసేందుకు ఎన్నడూ సిద్ధంగా ఉంటారన్నారు. దీని ద్వారా పార్టీ పటిష్టత మరింత పెరుగుతుందన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి డివిజన్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కచ్చితంగా గెలిచేందుకు ప్రయత్నం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు తదితరులు పాల్గొన్నారు


