Homeజిల్లాలుశ్రీ సత్యసాయిరేపటి సమ్మెను జయప్రదం చేయండి

రేపటి సమ్మెను జయప్రదం చేయండి

- Advertisement -

ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి జంగాలపల్లి పెద్దన్న


విశాలాంధ్ర ధర్మవరం: స్థానిక సిఐటియు కార్యాలయం వద్ద ఏపీ రైతు సంఘం, సిఐటియు, చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈ నెలలో 12న లేబర్ కోర్సు రద్దుకై దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలన్న పోస్టర్లను వారు విడుదల చేశారు.ఈ సందర్భంగా ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి జంగాలపల్లి పెద్దన్న. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు అయూబ్ ఖాన్. చేనేత కార్మిక సంఘం జిల్లా నాయకులు ఎస్హెచ్.బాషా. రైతు సంఘం మండల కార్యదర్శి శేషంపల్లి మారుతి మాట్లాడుతూ కార్మికులను బానిసలుగా చేసే నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేయాలని, విశాఖ స్టీల్ ప్లాంట్ కు సొంతగనులు కేటాయించాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటికరణ ఆపాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కనీస వేతనం 26,000 చెల్లించాలని తెలిపారు.
కొత్త ఉపాధి చట్టం వి బి జి రాంజీ రద్దు చేయాలని, ఉపాధి సంవత్సరానికి 200 రోజులు పని కల్పించాలి, రోజుకు 600 వేతనం ఇవ్వాలి, కౌలు రైతులను గుర్తించి అన్నదాత సుఖీభవ 20.000/- పంట రుణాలు ఇవ్వాలి అని, అన్ని పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని తెలిపారు.అంగన్వాడి, ఆశ, మిడ్ డే మీల్స్, వివోఏ, ఆర్పి సమగ్ర శిక్ష నేషనల్ హెల్త్ స్కీమ్ వర్కులను ప్రభుత్వ రంగ ఉద్యోగులుగా గుర్తించాలని, బిల్డింగు, ముఠా, ఆటో, గిగ్ వర్క్స్, మొదలైన అసంఘటితరంగ కార్మికులకు, పిఎఫ్, ఈఎస్ఐ, ఇన్సూరెన్స్ తో కూడిన సమగ్ర చట్టం చేయాలని, కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ టైం స్కేల్ తదితర ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని తెలిపారు. ఇతరత్రా డిమాండ్ల సాధనకై ఫిబ్రవరి 12 దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు జె.వి. రమణ, ఆదినారాయణ, ఖాదర్ భాష, గుంపు హరి, ఎస్. రఫీ, రైతు సంఘం నాయకులు , నరసింహారెడ్డి, మహబూబ్ సాబ్. తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు