అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఇజ్రాయెల్ రంగంలోకి దిగింది. ఆపరేషన్ షీల్డ్ ఆఫ్ జూడా పేరిట ఇరాన్ (Iran)పై శనివారం క్షిపణి దాడులకు దిగింది. దీంతో, భారీ పేలుళ్లతో రాజధానిలో పలు ప్రాంతాలు దద్దరిల్లాయి. దీంతో ఆ ప్రాంతంలో భారీగా పొగ వ్యాపించింది. అమెరికా సాయంతోనే ఇజ్రాయెల్ ఈ దాడులు చేసినట్లు తెలుస్తోంది.ఈ దాడిని తామే చేశామని టెల్అవీవ్ ప్రకటించింది. దీనిని ‘ఆపరేషన్ షీల్డ్ ఆఫ్ జూడాగా పేర్కొంది. శత్రు దేశం నుంచి పొంచిఉన్న ముప్పును తప్పించేందుకు ఈ దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి కట్జ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ నివాసం, నిఘా ప్రధాన కార్యాలయం సహా మొత్తం 30 ప్రాంతాలు లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి. ఈ క్రమంలో టెల్అవీవ్ సైన్యం తమ దేశ ప్రజలను అప్రమత్తం చేసింది. వైమానిక దాడులు జరిగే అవకాశం ఉన్నందున దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించింది. టెల్అవీవ్తో సహా పలు ప్రాంతాల్లో సైరన్లు మోగాయి. స్కూళ్లు, కార్యాలయాలను మూసివేయాలని ఆదేశించింది. ఈ దాడుల్లో అమెరికా హస్తం కూడా ఉన్నట్లు అధికార వర్గాలను ఉటంకిస్తూ మీడియాలో కథనాలు వస్తున్నాయి. తాజా దాడుల నేపథ్యంలో పౌర విమానాలకు ఇజ్రాయెల్ తన గగనతలాన్ని మూసివేసింది. అటు ఇరాన్, ఇరాక్‌లు కూడా గగనతలాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించాయి. ఇరాన్లో మొబైల్ ఫోన్ సేవలు నిలిచిపోయాయి.
ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులు..దద్దరిల్లిన రాజధాని
- Advertisement -
RELATED ARTICLES


