Homeసాహిత్యంతెలంగాణ సారస్వత పరిషత్తు రాష్ట్రస్థాయి ఉత్తమ గ్రంథ పురస్కారాలు

తెలంగాణ సారస్వత పరిషత్తు రాష్ట్రస్థాయి ఉత్తమ గ్రంథ పురస్కారాలు

- Advertisement -

తెలంగాణ సారస్వత పరిషత్తు 2026 సంవత్సరానికి తెలంగాణ రాష్ట్ర స్థాయి ఉత్తమ గ్రంథ పురస్కారాలకు గ్రంథాలు ఆహ్వానించింది.
2024, 2025 సంవత్సరాల్లో తొలిసారి ముద్రణ పొందిన పుస్తకాలు పోటీకి అర్హమవుతాయి. పద్య/గేయ కవిత్వం, వచన కవిత్వం, కథ, నవల, బాల సాహిత్యం, సాహిత్య విమర్శ, ఇతర ప్రక్రియలు అనే ఏడు విభాగాల్లో 20 వేల నగదు పురస్కారాలు అందజేయడం జరుగుతుంది.
కవిత్వం 60పుటలకు, మిగతా ప్రక్రియల్లో పుస్తకాలు 100పుటలకు తక్కువ ఉండరాదు.
. ప్రత్యేకంగా పిల్లల కోసం అన్ని ప్రక్రియలలో చేసిన రచనలు బాలసాహిత్యంలోకి వస్తాయి. బాల సాహిత్య రచనలకు పుటల పరిమితి లేదు.
. ఎం.ఫిల్, పీహెచ్‌డీ సిద్ధాంతగ్రంథాలు పోటీకి పరిశీలించడం జరగదు.
. ఒకసారి పరిషత్తు పోటీలో ఉత్తమ గ్రంథపురస్కారం పొందిన వారు మళ్లీ పోటీకి పంపవద్దు.
. పోటీకి గ్రంథాలు పంపేవారు జన్మతః తెలంగాణవారై ఉండాలని, ఇతర ప్రాంతాలవారు అర్హులు కారు.
. రచయితలు తమ పుస్తకాలను మూడు ప్రతుల చొప్ప్పున తెలంగాణ సారస్వత పరిషత్తు, తిలక్‌రోడ్, అబిడ్స్, హైదరాబాద్`1 చిరునామాకు 2026 మార్చి 25లోగా పంపాలి.
వివరాలకు 9603727234 ఫోన్ నెంబర్‌లో సంప్రదించవచ్చును.
డా॥ జె.చెన్నయ్య, ప్రధాన కార్యదర్శి

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు