విశాఖ : వందేళ్ల ఆంధ్ర యూనివర్సిటీ భవిష్యత్ –బాధ్యత- పై సదస్సు ఈ నెల 26 కళింగసీమ విద్యార్థులు- ఎస్ఎఫ్ఐ – ఏఐఎస్ఎఫ్,ఏఐడిఎస్ఓ, పిడిఎస్ఓ,ఏయు పూర్వ విద్యార్థుల నేతృత్వంలో నిర్వహించనున్నట్లు నిర్వాహకులు డాక్టర్ జీవితేశ్వరరావు, పి మేఘనాథ్ ఒక ప్రకటనలో తెలిపారు.కళింగసీమ గుండెకాయ విశాఖపట్నంలో నెలకొల్పిన ఆంధ్ర విశ్వవిద్యాలయం వందేళ్లు ఏప్రిల్ 26 తో నిండిన సందర్భంగా ప్రజల పండగగా జరుపుకోవాల్సిన సందర్భం ఉందన్నారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయం మద్రాస్ రాష్ట్రం లో విద్యామంత్రి గా ఉన్న అన్నెం పరశురాం పాత్రో 1925 లో ఆంధ్ర యూనివర్సిటీ చట్టం తీసుకువచ్చి నెలకొల్పారు. జస్టిస్ పార్టీ కి చెందిన సర్.సి.ఆర్.రెడ్డి ని మొదటి వైస్ ఛాన్సలర్ గా నియమించారు. ఆయనే విశాఖను ది సిటీ ఆఫ్ డెస్టినీ గా నామకరణం చేశారు. కళింగసీమ వారిని దరిచేరనీయలేదు. ప్రొఫెసర్ కె. వి. రమణ వి.సి అయ్యేవరకు స్థానికులకు అవకాశం రాలేదు. యిప్పటి యూనివర్సిటీ యంత్రాంగం ప్రభుత్వం యీ చారిత్రక వాస్తవాన్ని మరుగున పరచి ప్రైవేట్ వారికి యిచ్చిన ప్రాధాన్యత ఆంధ్ర యూనివర్సిటీ వారికి యివ్వలేదు. ఉత్సవాలు కూడా 27 న మొక్కుబడిగా జరుపుతున్నట్లు చూస్తున్నాం. యిది మన ఆత్మ గౌరవానికి గుర్తింపు పై జరుగుతున్న దాడి అని,అందుకే మనమే ఆ ఉత్సవాన్ని జరుపుకుందాం అన్నారు. యిప్పుడే మన భవిష్యత్ నిర్ణయించు కుందాం అని తెలిపారు. అల్లూరి విజ్ఞాన కేంద్రం డాబాగార్డెన్స్, విశాఖపట్నంలో ఈనెల 26న జరగనున్న సదస్సు ఉదయం 10గం.లకు మొదలవుతుందని, మాజీ వైస్ ఛాన్సలర్ లు, రాజ్యాంగపరమైన పదవి లో బాధ్యతలు నిర్వహించిన పలువురు ప్రముఖులు, మేధావులు వివిధ విద్యార్థి సంఘం నాయకులు హాజరుకానున్నారు. ఈ కార్యక్రమాన్ని అందరూ విచ్చేసి విజయవంతం చేయాలని కోరారు.
వందేళ్ల ఆంధ్ర యూనివర్సిటీ భవిష్యత్ –బాధ్యత- పై సదస్సు
- Advertisement -
RELATED ARTICLES


