Homeక్రీడలుబౌలర్లపై నిందలేయలేం: హార్దిక్ పాండ్య

బౌలర్లపై నిందలేయలేం: హార్దిక్ పాండ్య

- Advertisement -

ముంబై: ఐపీఎల్ 41వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్(ఎసఆర్‌హెచ్), ముంబై ఇండియన్స్ బుధవారం తలబడ్డాయి. ఎసఆర్‌హెచ్ ముంగిట భారీ లక్ష్యం నిర్దేశించినా కాపాడుకోవడంలో ముంబయి ఇండియన్స్ విఫలమైంది. 244 పరుగుల టార్గెట్‌ను ఎసఆర్‌హెచ్ మరో 8 బంతులు మిగిలిఉండగానే ఛేదించింది. బుమ్రా, బౌల్ట్, హార్దిక్ వంటి స్టార్లు ఉన్నప్పటికీ ఎసఆర్‌హెచ్‌ను నిలువరించలేకపోయింది. మ్యాచ్ అనంతరం ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్య మాట్లాడుతూ… ఇక్కడ మంచు ప్రభావం పెద్దగా లేదని, ప్రత్యర్థి బ్యాటర్లు మంచి షాట్లు కొట్టారని వెల్లడించాడు. తమకు బౌలింగ్ ఆప్షన్లు లేకుండా పోయాయని…అలాగని బౌలర్లపై నింద మోపలేనని వ్యాఖ్యానించాడు. ‘సన్‌రైజర్స్ బ్యాటర్లు చక్కటి షాట్లతో మా నుంచి మ్యాచ్‌ను దూరం చేశారు. మేం కూడా కొన్ని చెత్త బంతులు విసిరాం. మెరుగుపడాల్సిన అవసరం ఉంది. బ్యాటింగ్ పరంగా గత మ్యాచ్ కంటే చాలా బెటర్‌గా ఆడాం. 244 పరుగులను కాపాడుకోగలమని భావించాం. మా బౌలర్లు అడ్డుకోగలరని అనుకున్నా. మేం అనుకున్న ప్రణాళికలను సరిగా అమలు చేయలేకపోయాం. ఈ సీజన్‌లో మా దగ్గర ఎక్కువ ఆప్షన్లు లేకుండా పోయాయి. అలాగని మా బౌలర్లపై నిందలు వేయలేను. బౌలర్లు చాలా కష్టపడ్డారు. ఫీల్డింగ్ పరంగా వచ్చిన అవకాశాలను వదలకూడదు. లేకపోతే మ్యాచ్ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోతాయి. ఇలాంటి సమయంలో మాకు మద్దతు కావాలి. ఆటపై అభిరుచి కలిగిన యాజమాన్యం ఉంది. మంచి సహాయక సిబ్బంది ఉన్నారు. అభిమానుల సపోర్ట్ అద్భుతం. కానీ, కొన్నిసార్లు ప్రత్యర్థులు ఆధిపత్యం ప్రదర్శించినప్ప్పుడు బాధ కలగడం సహజమే. మున్ముందు అభిమానులను మరింత సంతోషింపజేయడానికి ప్రయత్నిస్తాం’ అని హార్దిక్ అన్నాడు

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు