విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంల ధర్మవరం డివిజన్ స్థాయిలో హెడ్మాస్టర్లతో సమావేశాన్ని నిర్వహించడం జరిగిందని ఎంఈఓ గోపాల్ నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మనబడి మన భవిష్యత్తు (నాడు నేడు) కింద జిల్లాలో 1248 ఆర్వో ప్లాంట్ ఫేస్ 1 ఫేస్ 2 కింద మంజూరైనటువంటి సరిగా పనిచేయని వాటి పైన 10 మండలాల హెడ్మాస్టర్ లకు అవగాహన కల్పించడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి శ్రీ సత్యసాయి జిల్లా జిల్లా విద్యాశాఖ అధికారి కృష్ణప్ప మాట్లాడుతూ సెలవులు ముగిసిన వెంటనే పాఠశాల జూన్ 12న ప్రారంభించే నాటికి ప్రతి పాఠశాలలో ఆర్వో ప్లాంట్లు పనిచేసేటట్లు చేయాలని ఆదేశించడం జరిగింది అని తెలిపారు. అదేవిధంగా 10వ తరగతి ఫెయిల్ అయినటువంటి విద్యార్థులకు రెమెడియన్ క్లాసులు నిర్వహించాలని , ఐదు సంవత్సరాలు ప్రతి విద్యార్థి ప్రాథమిక పాఠశాలలో నమోదు చేయాలని పై క్లాస్ లో ఉన్నటువంటి విద్యార్థులను ఆన్లైన్లో పై తరగతి నమోదు చేయాలని ఆదేశించడం జరిగింది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ధర్మవరం మండల విద్యాశాఖ అధికారి
బి. గోపాల్ నాయక్, సీఎమ్ఓ హరిప్రసాద్, ఏపీవో పని రాజ్ శర్మ, ఏ ఎస్ ఓ మాధవరెడ్డి, కొత్తపేట హెడ్ మిసెస్ పద్మావతి , ఆక్వా, హైడ్రో, లిపిఓ, ఆర్ఓ ప్లాంట్ టెక్నీషియన్లు కిశోర్, నగేష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
హెడ్మాస్టర్ లతో సమావేశం.. ఎంఈఓ గోపాల్ నాయక్
- Advertisement -
RELATED ARTICLES


