Homeజిల్లాలుశ్రీ సత్యసాయివేసవి శిక్షణ తరగతులు విద్యార్థులకు ఒక వరం లాంటి..

వేసవి శిక్షణ తరగతులు విద్యార్థులకు ఒక వరం లాంటి..

- Advertisement -

గ్రంథాలయ రికార్డు అసిస్టెంట్ రాము
విశాలాంధ్ర ధర్మవరం:: వేసవి శిక్షణా తరగతులు విద్యార్థులకు ఒక వరం లాంటివని గ్రంథాలయ రికార్డ్ అసిస్టెంట్ రాము తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని బాబు జగ్జీవన్ రామ్ నగర్ లో ఉచిత వేసవి శిష్యుల తరగతులకు విద్యార్థుల నుండి మంచి స్పందన వస్తోంది. ఇందులో భాగంగా వివిధ పాఠశాల విద్యార్థులకు పుస్తక పటనం ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ధర్మవరం టిడిపి పట్టణ అధ్యక్షులు సుధాకర్ హాజరుకాగా వారి చేతులమీదుగా చరిత్ర సంస్కృతి అనే పుస్తకాన్ని పాఠకుల నడుమ ఆవిష్కరించారు. అదేవిధంగా డొక్కా సీతమ్మ జీవిత చరిత్ర, శతక పద్యాలను కే.కేశవ నేర్పించడం జరిగిందన్నారు. అదేవిధంగా యోగాలో రిసోర్స్ పర్సన్ సూర్యనారాయణ, విద్యార్థులకు మెలకువలను నేర్పారు. నిత్యజీవితంలో యోగా వలన కలిగే ప్రయోజనాలను విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రంధాలయ సిబ్బంది శివమ్మ, రమణ నాయక్, గంగాధర్, పాఠశాల విద్యార్థులు, గ్రంధాలయ పాఠకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు