అనంతపురం జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి ఎన్ రాజశేఖర్. విశాలాంధ్ర అనంతపురం టౌన్
జిల్లా కోర్టు సముదాయంలో గల న్యాయ సేవా సదన్ లో బుధవారం నిర్వహించిన సమన్వయ సమావేశంలో అనంతపురం జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి ఎన్ రాజశేఖర్ మాట్లాడుతూ… మాజీ సైనికుల సమస్యలు పరిష్కరించడానికి ప్రత్యేక చొరవ తీసుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారి మలోల ని జిల్లా సైనిక్ అధికారి రజాక్ఖాన్ ని మున్సిపల్ పంచాయతీ మరియు పోలీస్ అధికారులను కోరారు. బుధవారం న్యాయ సేవా సదన్ లో వీర పరివార్ సహాయతా యోజన పథకం అమలులో భాగంగా మాజీ సైనికులు వారి కుటుంబ సభ్యులు మరియు జిల్లా రెవెన్యూ తదితర యంత్రాంగలతో ఈ సమన్వయ సమావేశాన్ని నిర్వహించి మాజీ సైనికులు యొక్క సమస్యల్ని తెలుసుకొని తద్వారా సంబంధిత శాఖలవారు ప్రత్యేక చొరవ తీసుకొని పరిష్కరించాలని మరియు వారికి న్యాయపరమైనటువంటి సలహాలు కొరకు జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ అనంతపురం అందుబాటులో ఉంటుందని వారి సేవలను వినియోగించుకోవాలని కోరారు. జిల్లా రెవెన్యూ అధికారి మలోల మాట్లాడుతూ… గౌరవ కలెక్టర్ చొరవ తీసుకొని దాదాపు 50 మంది దాకా మాజీ సైనికులకు భూ పంపిణీ చేశామని సమస్యలు పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ చూపించి తగువిధంగా స్పందిస్తామని హామీ ఇచ్చారు. జిల్లా సైనిక సంక్షేమ అధికారి రజాక్ ఖాన్ మాట్లాడుతూ… మాజీ సైనికుల ఎదుర్కొంటున్న సమస్యలను వివరిస్తూ వాటి పరిష్కారానికి జిల్లా యంత్రాంగం కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ అంజయ్య జిల్లా పంచాయతీ అధికారి తరపున అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోలీసు వారు మాజీ సైనికులు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
మాజీ సైనికుల సమస్యలు త్వరితగతిన పరిష్కరించండి
- Advertisement -


