Homeజిల్లాలుతూర్పు గోదావరిరిజర్వేషన్లు రద్దు చేయాలి

రిజర్వేషన్లు రద్దు చేయాలి

- Advertisement -

గడప గడపకు బ్రాహ్మణ్ కార్యక్రమంలో బ్రాహ్మణ సేవా సంఘం డిమాండ్

విశాలాంధ్ర – కడియం : గత 75 సంవత్సరాలుగా కొనసాగుతున్న రిజర్వేషన్లు రద్దు చేయాలని, ప్రతిభ ఆర్థిక పరిస్థితుల ఆధారంగా ప్రత్యేక రిజర్వేషన్ కల్పించాలని గడపగడపకి బ్రాహ్మిణ్ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా బ్రాహ్మణ సేవా సంఘం సభ్యులు డిమాండ్ చేశారు. కడియం మండలం, మురమండ గ్రామంలో ఆదివారం సాయంత్రం గడపగడపకు బ్రాహ్మణ్ కార్యక్రమాన్ని జిల్లా అధ్యక్షులు మాదిరాజు శ్రీనివాసు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బ్రాహ్మణులంతా ఐక్యత సఖ్యత పెంపొందించుకోవాలని, బ్రాహ్మణులపై భౌతిక దాడులు జరుగుతున్న తరుణంలో అట్రాసిటీ చట్టబద్ధత బ్రాహ్మణులు కల్పించాలని, పౌరోహిత్యం లాంటి వృత్తులను బ్రాహ్మణ కుల వృత్తులుగా చేయాలని, అగ్రకులాల్లో పేదలకు ఆర్థిక పరిస్థితి మరియు ప్రతిభ అంశాల ఆధారంగా రిజర్వేషన్ కల్పించాలని తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో కడియం మండల అధ్యక్షులు వేదాంతం జగన్నాథ ఆచార్యులు( నాని), పున్నమిరాజు వీర్రాజు, కానుకట్టు ప్రకాష్, దోనేపూడి బ్రహ్మాజీ, రాజమండ్రి నగర అధ్యక్షులు దూర్వాసుల సత్యనారాయణ, కార్యక్రమ కన్వీనర్ నిడమర్తి వెంకట్, రాజమండ్రి యువజన కార్యదర్శి గుడిపూడి గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు