విశాలాంద్ర బ్యూరో ` కర్నూలు : కారుణ్య నియామకాల కింద వివిధ శాఖల్లో 21 మందికి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఇస్తూ జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి అభ్యర్థులకు నియామక ఉత్తర్వులు అందచేశారు.సోమవారం కలెక్టరేట్ లోని సునయన ఆడిటోరియంలో కారుణ్య నియామకం కింద ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు కలెక్టర్ నియామక ఉత్తర్వులను అందచేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఉద్యోగాలు పొందిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని కలెక్టర్ సూచించారు. ఉద్యోగ విధులను బాధ్యతయుతంగా నిర్వర్తించి ప్రజలకు మంచి చేయాలన్నారు.. ఎటువంటి అవినీతికి పాల్గొనకుండా సక్రమంగా బాధ్యతలు నిర్వర్తించాలన్నారు. విధి నిర్వహణలో ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా నేర్చుకోవాలని, కష్టపడితే భవిష్యత్తులో మండల, డివిజన్ మరియు జిల్లా స్థాయి అధికారులుగా ఎదిగే అవకాశం ఉంటుందన్నారు.జిల్లా కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ, చొరవ చూపడం వల్ల తమకు ఉద్యోగ నియామకం జరిగిందని అభ్యర్థులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేశారు.కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్, ఇంచార్జి డిఆరఓ చిరంజీవి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సునీత, రామసుబ్బయ్య, సెక్షన్ సిబ్బంది సన, తదితరులు పాల్గొన్నారు.
కారుణ్య నియామకాల కింద 21 మందికి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు : జిల్లా కలెక్టర్
- Advertisement -
RELATED ARTICLES


