11 మంది అరెస్ట్.. నగదు, సెల్‌ఫోన్లు, బైక్‌లు స్వాధీనం
విశాలాంధ్ర-తాడిపత్రి: మండల పరిధిలోని సజ్జలదిన్నె గ్రామ శివారులో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై మంగళవారం పోలీసులు ఆకస్మిక దాడి నిర్వహించారు. ఈ దాడిలో 11 మంది పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.రూరల్ సీఐ శివగంగాధర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం, పేకాట ఆడుతున్న వారిని పట్టుకుని వారి వద్ద నుంచి రూ.44,820 నగదు, 7 సెల్‌ఫోన్లు, 6 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు.గ్రామ శివారులో అక్రమంగా పేకాట నిర్వహిస్తున్నారనే సమాచారంతో పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టి దాడి చేపట్టినట్లు తెలిసింది. అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలు కొనసాగుతాయని పోలీసులు హెచ్చరించారు.


