Homeఅంతర్జాతీయంగల్ఫ్ దేశాల అభ్యర్థన…ఇరాన్‌పై దాడి నిలుపుదల: ట్రంప్

గల్ఫ్ దేశాల అభ్యర్థన…ఇరాన్‌పై దాడి నిలుపుదల: ట్రంప్

- Advertisement -


వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై దాడులను నిలుపుదల చేశారు. గల్ఫ్ దేశాల అభ్యర్థన మేరకు దాడి నిర్ణయాన్ని తాజాగా ఆయన పక్కన పెట్టేశారు. ఈ మేరకు ట్రంప్ స్వయంగా ట్రూత్ సోషల్‌లో పోస్టు ద్వారా ఈ విషయాలు వెల్లడించారు. ఇరాన్‌పై మంగళవారం సైనిక దాడికి ప్రణాళిక వేసినట్లు ట్రంప్ తెలిపారు. అయితే, తెహ్రాన్‌తో ప్రస్తుతం తీవ్రమైన చర్చలు జరుగుతున్నందున… దాడిని వాయిదా వేయాలని ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈ నాయకుల నుంచి తనకు ప్రత్యక్షంగా విజ్ఞప్తులు వచ్చాయని తెలిపారు. దీంతో వారి అభ్యర్థన మేరకు ఇరాన్‌పై చేపట్టాలనుకున్న సైనిక దాడిని తాత్కాలికంగా పక్కన పెట్టినట్లు ప్రకటించారు. ఇరాన్‌తో జరిగే ఒప్పందంలో ఆ దేశం వద్ద అణ్వాయుధాలు ఉండకూడదని పునరుద్ఘాటించారు. గల్ఫ్ మిత్రులపై ఉన్న గౌరవంతో ఇరాన్‌పై జరగాల్సిన దాడిని నిలిపివేయాలని రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్‌కు, యూఎస్ సైన్యానికి ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ఈ క్రమంలో ఇరాన్‌తో చర్చలు విఫలమై, దానితో ఒక ఒప్పందం కుదరకపోతే…విధ్వంసకర రీతిలో దాడి చేస్తామని ట్రంప్ హెచ్చరించారు. ఇందుకు సిద్ధంగా ఉండాలని తన యంత్రాంగాన్ని ఆదేశించినట్లు స్పష్టం చేశారు.
కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పటికీ…హోర్మూజ్ జలసంధి, అణు కార్యక్రమం వంటి విషయాల్లో అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇరాన్‌తో ఎలా అయినా ఒప్పందం కుదుర్చుకోవాలని ట్రంప్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే, ఒప్పందం కోసం ఇరాన్ పంపిన ప్రణాళికలను తిరస్కరిస్తూనే ఉన్నారు. తాజాగా ఇరాన్ సవరించిన 14 పాయింట్ల శాంతి ప్రణాళికను పాక్ మధ్యవర్తిత్వంతో అమెరికాకు పంపింది. ట్రంప్ దీన్ని కూడా తిరస్కరించారు.
నేపథ్యంలో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. చర్చల్లో పాల్గొనడం అంటే… లొంగిపోయినట్లు కాదన్నారు. దేశ హక్కులను పరిరక్షిస్తూనే తాము చర్చల్లో పాల్గొంటున్నామని వివరించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు