Homeజిల్లాలుపార్వతీపురం మన్యండిగ్రీ తెలుగు పాఠ్యాంశంలో రవీంద్రనాథ్ రచించిన 'హా…హతవిధీ"కవిత చేర్పు

డిగ్రీ తెలుగు పాఠ్యాంశంలో రవీంద్రనాథ్ రచించిన ‘హా…హతవిధీ”కవిత చేర్పు

- Advertisement -

విశాలాంధ్ర, పార్వతీపురం: జిల్లాకేంద్రానికి చెందిన ఉపాధ్యాయుడు, కవి పక్కి రవీంద్రనాథ్ రచించిన “హా… హతవిధి” అనేకవితను డిగ్రీ మూడవ సెమిస్టర్ లో బోధన నిమిత్తం
ఎంపికచేస్తూ తెలుగు పాఠ్యపుస్తక మండలి నిర్ణయించింది.సంపాదకులు సుంకర గోపాలయ్య కవి పక్కి రవీంద్రనాథ్ అనుమతిని కోరుతూ లేఖను పంపించారు. డిగ్రీ మూడవ సెమిస్టరులో కవిత్వ నిర్మాణమునకు సంబంధించిన పాఠంలో రవీంద్రనాథ్ కవితను చేర్చుతున్నట్టు లేఖలో ఆయన తెలిపారు.
రవీంద్రనాథ్ రచించిన నొయిడా నిఠారి కాల్వలో …అనుకవిత హిందీ అనువాదాన్ని గతంలో పుదుచ్చేరి ప్రభుత్వం డిగ్రీ విద్యార్ధులకు పాఠ్యాంశముగా ప్రవేశపెట్టింది.
ఇతని రచన డిగ్రీ విద్యార్ధులకు పాఠ్యాంశముగా ఎంపిక కావడం పట్ల స్నేహకళాసాహితికి చెందిన రచయితలు గంటేడ గౌరునాయుడు, గడగమ్మ రామకృష్ణ, మల్లిపురం జగదీష్, చింత అప్పలనాయుడు, సిరికి స్వామినాయుడు, చందనపల్లి గోపాలరావు మరియు పట్టణానికి చెందిన ప్రముఖ సాహితీవేత్తలు మంచిపల్లి శ్రీరాములు, బెహరా ఉమామహేశ్వరరావు, బెలగాం భీమేశ్వరరావు, నారంశెట్టి ఉమామహేశ్వరరావు తుంబలి శివాజీ, వంజరాపు శేషుతదితరులు హర్షం వ్యక్తం చేస్తూ తమ అభినందనలు తెలియజేశారు. పలువురు ఉపాధ్యాయులు, అభిమానులు కూడా పక్కికు అభినందనలు తెలిపారు. గతంలో గంటేడ గౌరు నాయుడుకు సంబంధించిన కవితను డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం తెలుగు పాఠ్యాంశంగా చేర్చిన సంగతి తెలిసిందే. దీంతోపాటు పట్టణానికి చెందిన కవి సిరికి స్వామి నాయుడుకు చెందిన కవితను కూడా ఈ ఏడాది నుండి డిగ్రీలో పాఠ్యాంశముగా చేర్చిన సంగతి తెలిసిందే. పార్వతీపురం పట్టణానికి చెందిన ముగ్గురు రచయితల కవితలు డిగ్రీ తెలుగు బోధనా భాషలో చేర్చడం పార్వతీపురం జిల్లాకే కాక ఉత్తరాంధ్ర కే గర్వకారణమని పలు సాహిత్య సంస్థలు తెలిపాయి.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు