Homeజిల్లాలుపార్వతీపురం మన్యంవెట్టిచాకిరి విముక్తుడికి రూ. 3లక్షల పునరావాస ప్యాకేజీ అందజేత

వెట్టిచాకిరి విముక్తుడికి రూ. 3లక్షల పునరావాస ప్యాకేజీ అందజేత

- Advertisement -


విశాలాంధ్ర-​పార్వతీపురం: వెట్టి చాకిరి సంకెళ్ళనుండి విముక్తిపొందిన పార్వతీపురం మన్యంజిల్లాకు చెందిన కొండగొర్రి అప్పారావుకు ప్రభుత్వంనుండి అందాల్సిన పూర్తి పునరావాస ప్యాకేజీ ఎట్టకేలకు చేకూరింది. గురువారం జిల్లా కలెక్టరేట్‌లో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకర రెడ్డి చేతుల మీదుగా మూడు లక్షల రూపాయలవిలువైన డిపాజిట్ బాండ్లను అప్పారావుకు అందజేశారు.​గతఏడాది తమిళనాడులోని శివగంగ ప్రాంతంలో వెట్టి చాకిరి నుండి అప్పారావు విముక్తి పొందారు. అయితే, ఆయనకు అందాల్సిన ఆర్థిక సహాయం సాంకేతిక కారణాల వల్ల నిలిచిపోయింది. లేబర్ డిపార్ట్‌మెంట్, నేచర్ ఎన్‌జీఓ, ఐజెఎం సంస్థల ప్రతినిధులు ఏడాది పాటు నిరంతరంగా కృషిచేసి, తమిళనాడులోని శివగంగ బ్రాంచ్ నుండి నిధులను పార్వతీపురం బ్రాంచ్‌కు బదిలీ చేయించడంలో సఫలీకృతులయ్యారు. ఈపునరావాస పంపిణీ కార్యక్రమం ‘వెట్టి చాకిరి వ్యవస్థ (నిర్మూలన) చట్టం, 1976’ యొక్క గోల్డెన్ జూబిలీ 50ఏళ్లవేడుకల సమయంలో జరగడం విశేషం. సామాజిక న్యాయం, బాధితుల హక్కుల రక్షణలో ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థల సమన్వయానికి ఇది ఒక నిదర్శనమన్నారు.​ఈకార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ సువర్ణ, నేచర్ ఎన్‌జీఓ ప్రతినిధులు, ఐజెఎం సంస్థ సభ్యులు, ఇతర ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. అప్పారావుకు పూర్తిస్థాయిలో ఆర్థిక భరోసా కల్పించడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు