Homeజిల్లాలుఅనంతపురం2న బూత్ స్థాయి ప్రతినిధులకు శిక్షణా కార్యక్రమం

2న బూత్ స్థాయి ప్రతినిధులకు శిక్షణా కార్యక్రమం

- Advertisement -

విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా) :- ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియకు సంబంధించి నియోజకవర్గంలోని బూత్ స్థాయి ప్రతినిధులకు (బీఎల్‌ఏలు) జూన్ 2వ తేదీ మంగళవారం నార్పలలో శిక్షణా కార్యక్రమం నిర్వహించనున్నట్లు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణ రెడ్డి తెలిపారు.
మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు, నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ మంత్రి సాకే శైలజనాథ్ సూచనలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ, మండల కేంద్రమైన నార్పలలోని ఎస్‌వీ ఫంక్షన్ హాల్‌లో జరిగే ఈ సమావేశంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. అలాగే 2002 నుంచి 2025 వరకు ఓటర్ల జాబితాల అనుసంధాన (మ్యాపింగ్‌), అనుసంధానం కాని (నాన్‌ మ్యాపింగ్‌) వివరాలు, ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలపై సమగ్ర శిక్షణ అందించనున్నట్లు చెప్పారు.
నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల కన్వీనర్లు, పార్టీ నాయకులు, బూత్ స్థాయి ప్రతినిధులు ఈ కార్యక్రమానికి తప్పనిసరిగా హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు