విశాలాంధ్ర ధర్మవరం;; వచ్చే 3నెలల్లోపు ప్రభుత్వం కొత్త పింఛన్లు అందజేస్తుందని.. ధర్మవరం టీడీపీ ఇన్ ఛార్జి పరిటాల శ్రీరామ్, ఎంపీ పార్థసారధి తెలిపారు. ఈ సందర్భంగా వారు పలు కాలనీల్లో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లు పంపిణీ చేశారు. పట్టణంలోని లక్ష్మీచెన్నేకేశవస్వామి ఆలయం పరిసరాల్లో జరిగిన పింఛన్ల పంపిణీలో శ్రీరామ్ తో పాటు హిందూపురం ఎంపీ పార్థసారథి కూడా పాల్గొన్నారు. ఇంటింటికీ వెళ్తూ వారు పింఛన్లు పంపిణీ చేశారు. ప్రతి నెల ఒకటవ తేదిన పింఛన్లు వస్తున్నాయా?.. ఎవరైనా డబ్బు అడుగుతున్నారా?.. వంటి అంశాల గురించి ఆరా తీశారు. ఎక్కడ డబ్బు అగడటం లేదని.. 1వ తేది ఉదయాన్నే ఇంటి వద్దకు వచ్చి పింఛన్లు అందిస్తున్నారని లబ్ధిదారులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈసందర్భంగా శ్రీరామ్, ఎంపీ పార్థసారథి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పథకాల్లో పింఛన్ల పంపిణీ కూడా ఒకటి అన్నారు. ఎక్కడ లబ్ధిదారులకు ఇబ్బంది పడకుండా గత ప్రభుత్వంలో లాగా కమీషన్లు, మోసాలకు తావు లేకుండా పింఛన్లు అందిస్తున్నట్టు స్పష్టం చేశారు. ఒకటవ తేదిన పింఛన్లు అందుకుంటున్న లబ్ధిదారులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. ఏ పథకమైనా సరే లబ్ధిదారునికి నేరుగా చేరాలన్నదే ప్రభుత్వ లక్ష్యం అన్నారు. ఎక్కడా అవినీతి, నిర్లక్ష్యానికి తావు ఉండదన్నారు. కొత్త పింఛన్లు కావాలని ఇప్పటికే చాలా మంది దరఖాస్తులు చేసుకున్నారని, వారి కొరకు ప్రభుత్వం ఆలోచించి నిర్ణయాన్ని వచ్చే రెండు మూడు నెల్లలోనే మంజూరు చేసే అవకాశం ఉందన్నారు. ప్రమాణ స్వీకారం చేసిన రోజున పింఛన్ల మొత్తాన్ని పెంచిన నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని అన్నారు. ఒక్క పింఛన్ల పంపిణీ కోసమే ప్రభుత్వం 45వేల కోట్లు ఖర్చు చేస్తోందన్నారు. ధర్మవరం పట్టణంలో 17వేల పింఛన్లు అందుతున్నాయని.. ఇందుకోసం రూ.6.80కోట్లు ఖర్చు చేస్తున్నట్టు తెలిపారు. ధర్మవరంలో రోడ్ల సమస్యల గురించి ప్రజలు చెబుతున్నారని.. త్వరలోనే వీటి మరమ్మతులు చేస్తామని.. ఇతర సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. సూపర్ సిక్స్ హామీలన్నీ ఇప్పటికే అమలు చేశామని.. మిగిలిన వాటిని కూడా అమలు చేస్తామన్నారు. కొత్త పింఛన్లు కూడా త్వరలోనే మంజూరవుతాయని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
3 నెలల్లోపు కొత్త పింఛన్లు అందజేస్తాం.. పరిటాల శ్రీరామ్, ఎంపీ పార్థసారథి
- Advertisement -
RELATED ARTICLES


