- Advertisement -
విశాలాంధ్ర ధర్మవరం : ధర్మవరం మండల నూతన తాసిల్దారుగా దేవరాజ్ నియమించడంతో, సాగునీటి సంఘం అధ్యక్షులు రేనాటి శ్రీనివాసులు, సీసీ కొత్తకోట చెరువు సంఘం అధ్యక్షులు నారపరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం తాసిల్దార్ను శాలువాతో ఘనంగా సన్మానించారు. తదుపరి సాగునీటి సమస్యలను వారికి విన్నవించారు. ధర్మవరం చెరువుకు సంబంధించిన కాలువలను సర్వే చేయించాలని ఇదివరకే కలెక్టర్కు విన్నవించామని, మీ ద్వారా ఆ పని వేగవంతం చేయాలని వారు కోరారు.


