Homeజాతీయంఅమరావతి అభివృద్ధికి మోదీ సర్కార్ కట్టుబడి ఉంది: ప్రహ్లాద్‌ జోషి

అమరావతి అభివృద్ధికి మోదీ సర్కార్ కట్టుబడి ఉంది: ప్రహ్లాద్‌ జోషి

- Advertisement -

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అమరావతి అభివృద్ధికి పూర్తిస్థాయిలో కట్టుబడి ఉందని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి స్పష్టం చేశారు.
ఒక రోజు పర్యటనలో భాగంగా విజయవాడకు వచ్చిన ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. విజయవాడలోని వాజ్‌పేయీ పార్క్లో స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రహ్లాద్ జోషి స్వయంగా చీపురు పట్టి పార్కు పరిసరాలను శుభ్రం చేశారు.అనంతరం భాజపా రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, ఎమ్మెల్యే సుజనా చౌదరిలతో కలిసి మొక్కలు నాటారు.అలాగే పార్క్‌కు వచ్చిన వాకర్స్‌తో ముచ్చటిస్తూ వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.

ఇండియా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశ చరిత్రలో అత్యధిక కాలం సేవలందించిన ప్రధానిగా నరేంద్ర మోదీ నిలిచిపోయారని పేర్కొన్నారు.
2014కు ముందు భారత ఆర్థిక వ్యవస్థ క్షీణ స్థితిలో ఉండేదని, మోదీ ప్రధాని అయిన తర్వాత భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందిందని చెప్పారు.
రైల్వే ఎలక్ట్రిఫికేషన్ విషయంలో భారత్ ప్రపంచంలో రెండో స్థానంలో నిలిచిందని ఆయన వివరించారు. అలాగే దేశంలో ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ ఎనిమిది రెట్లు పెరిగిందని తెలిపారు.
రాజధాని అమరావతి అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని పేర్కొన్న ప్రహ్లాద్ జోషి, అమరావతి కోసం హడ్కో నుంచి రూ.11 వేల కోట్ల నిధులు అందించినట్లు గుర్తుచేశారు.

పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తాం
అంతేకాకుండా అమరావతిని అనుసంధానించే ప్రత్యేక రైల్వే లైన్ కోసం కూడా కేంద్రం నిధులు సమకూర్చిందన్నారు.రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మాధవ్ కలిసి సమన్వయంతో పనిచేస్తున్నారని ఆయన ప్రశంసించారు.రాజధాని అమరావతికి రహదారి, రైల్వే కనెక్టివిటీని మరింతగా పెంచుతున్నామని వెల్లడించారు.అమరావతి సమగ్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తోందని, రాష్ట్ర పురోగతికి అవసరమైన అన్ని విధాలుగా అండగా నిలుస్తామని ప్రహ్లాద్ జోషి స్పష్టం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు