Homeజాతీయంజూన్ 26న స్కూళ్లకు సెలవు!

జూన్ 26న స్కూళ్లకు సెలవు!

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలలు, ప్రభుత్వ విద్యాసంస్థలకు జూన్ 26వ తేదీన సెలవు ప్రకటించింది. వాస్తవానికి సాధారణ సెలవుల క్యాలెండర్ ప్రకారం ఈ సెలవు జూన్ 25న ఉండాల్సి ఉన్నప్పటికీ, తాజా పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం దానిని ఒక రోజు వాయిదా వేసి జూన్ 26కు మార్చింది. ముస్లిముల పవిత్ర పండుగ మొహర్రం జూన్ 26న జరగనున్నట్లు వక్ఫ్ బోర్డు సీఈవో రాష్ట్ర ప్రభుత్వానికి అధికారికంగా సమాచారం అందించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే స్పందించి, ముందుగా జూన్ 25కు ప్రకటించిన సెలవును జూన్ 26వ తేదీకి మార్చుతూ ఉత్తర్వులు జారీ చేసింది.

జూన్ 26న మొహర్రం
ఈ మార్పు కేవలం పాఠశాలలకు మాత్రమే కాకుండా ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, ఇతర ప్రైవేట్ సంస్థలకు కూడా వర్తిస్తుందని ప్రభుత్వం విడుదల చేసిన జీవోలో స్పష్టం చేసింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా జూన్ 26న సాధారణ సెలవు అమల్లో ఉండనుంది. ఇక వేసవి సెలవులు ముగిసిన అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాలలు జూన్ 12 నుంచే పునఃప్రారంభమయ్యాయి. మరోవైపు పొరుగు రాష్ట్రం తెలంగాణలో జూన్ 15 నుంచి విద్యాసంస్థలు తిరిగి ప్రారంభమయ్యాయి. పాఠశాలలు ప్రారంభమైన కొద్ది రోజులకే ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు తొలి ప్రభుత్వ సెలవు లభించనుంది. మొహర్రం పండుగ సందర్భంగా జూన్ 26వ తేదీ (శుక్రవారం) రాష్ట్రంలోని విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగులు సెలవును పొందనున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు