నాగ్‌పూర్ అభ్యర్థికి అబుధాబీలో సెంటర్
నాగ్‌పూర్: నీట్ రీ-ఎగ్జామ్‌కు సంబంధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిర్లక్ష్యం మరొక్కసారి బయటపడింది. ఎన్టీఏ జారీ చేసిన అడ్మిట్ కార్డులో లోపాలు బయటపడ్డాయి. మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌కు చెందిన ఓ అభ్యర్థికి…యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని అబుధాబీలో పరీక్షా కేంద్రాన్ని కేటాయించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనిపై స్పందించిన ఎన్టీఏ… సమస్యను పరిష్కరిస్తున్నట్లు తెలిపింది.
ఎన్టీఏ నిర్లక్ష్యానికి ఇదీ ఓ నిదర్శనం…
నీట్ రీటెస్టుకు సమయం దగ్గరపడుతోన్న నేపథ్యంలో అబ్దుల్లా మహ్మద్ తాలిబ్ అనే అభ్యర్థి శుక్రవారం సాయంత్రం తన అడ్మిట్ కార్డును డౌన్లోడ్ చేసుకున్నాడు. అందులో తన పరీక్షా కేంద్రాన్ని చూసి అవాక్కయ్యాడు. అబుధాబీలోని ఓ భారతీయ స్కూల్లో ఎన్టీఏ అతడికి పరీక్షా కేంద్రాన్ని కేటాయించింది. ఈ అడ్మిట్ కార్డుకు సంబంధించిన ఫొటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. తాము ఇచ్చిన ఆప్షన్లలో అలాంటి కేంద్రం ఏదీ లేదని విద్యార్థి తండ్రి మీడియాకు తెలిపారు. ఈ విషయాన్ని ఎన్టీఏ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. శనివారం సాయంత్రం 4 గంటల్లోపు కొత్త అడ్మిట్ కార్డు జారీ చేస్తామని తమకు హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. సమయం తక్కువగా ఉన్నందున నాగ్పుర్నే పరీక్షా కేంద్రంగా కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సంఘటనతో తన కొడుకు తీవ్ర ఆందోళనలో ఉన్నట్లు తెలిపారు.
సాంకేతిక లోపం కారణంగానే: ఎన్టీఏ
దీనిపై ఎన్టీఏ కూడా స్పందించింది. సాంకేతిక లోపం కారణంగానే ఇలా జరిగినట్లు పేర్కొంది. సమస్యను పరిష్కరిస్తున్నామని, కొన్ని గంటల్లోనే ఆ విద్యార్థికి పరీక్షా కేంద్రాన్ని కేటాయిస్తామని స్పష్టంచేసింది. కాగా…అడ్మిట్ కార్డులో వ్యక్తిగత వివరాలు, పరీక్ష కేంద్రాలు ఇతర ముఖ్యమైన అంశాల్లో ఏమైనా లోపాలు ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని ఈసందర్భంగా నీట్ అభ్యర్థులకు ఎన్టీఏ సూచించింది.
నీట్ రీ-ఎగ్జామ్‌లో ఎన్టీఏ నిర్లక్ష్యం
- Advertisement -
RELATED ARTICLES


