Homeఆంధ్రప్రదేశ్సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో కోర్టుకు రాని అల్లు అర్జున్

సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో కోర్టుకు రాని అల్లు అర్జున్

- Advertisement -

టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్, సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట కేసుకు సంబంధించి నాంపల్లి కోర్టుకు హాజరు కాలేదు. సినిమా షూటింగ్‌లో ఉన్నందున వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని బ‌న్నీ కోరిన‌ట్లు తెలుస్తోంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న మిగతా 18 మంది కోర్టు ఎదుట హాజరై బాండ్లపై సంతకాలు చేశారు.2024 డిసెంబర్ 4న పుష్ప 2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించగా, ఆమె కుమారుడు శ్రీతేజ గాయపడిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనపై కేసు నమోదు చేసిన చిక్కడపల్లి పోలీసులు, విచారణ అనంతరం మొత్తం 23 మందిపై ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఈ ఛార్జ్‌షీట్‌లో సంధ్య థియేటర్ యాజమాన్యాన్ని A1 నుంచి A10 వరకు నిందితులుగా పేర్కొన్న పోలీసులు, అల్లు అర్జున్‌ను A11గా చేర్చారు. ఈ క్రమంలోనే 19 మంది నిందితులకు కోర్టు ఇటీవల సమన్లు జారీ చేసింది. ఈరోజు విచారణకు అల్లు అర్జున్ మినహా మిగతా నిందితులందరూ హాజరయ్యారు. వాదనలు విన్న న్యాయస్థానం, తదుపరి విచారణను జులై 6వ తేదీకి వాయిదా వేసింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు