విశాలాంధ్ర ధర్మవరం : పట్టణంలోని నాటు సారాయి తయారీదారులు, అక్రమ మద్యం అమ్మకాల దాడులపై అనంతపురం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ ప్రసాద్ ఆదేశాల మేరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగిందని ఎక్సైజ్ సీఐ చంద్రమణి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జరిపిన దాడులలో వేల్పుమడుగు క్రాస్ వద్ద ఈదుల ముష్ఠురు కు చెందిన ఎస్.వెంకటేశులు అనే వ్యక్తి ను అరెస్ట్ చేసి, అతని నుంచి 08 మద్యం బాటిల్స్ ను స్వాదీనం చేసుకోవడమైనది అని తెలిపారు. అనంతరం కేసును నమోదు చేయడమైనది అని తెలిపారు. అదేవిధంగా బహిరంగ ప్రదేశాలు లో మద్యం సేవించు చుండగా ఇద్దరి పై కేసులు కట్టి చర్యలు తీసుకోవడమైనది అని తెలిపారు. ధర్మవరం రైల్వే స్టేషన్ లో ప్రయాణికులకు మాదక పదార్థాలు గురించి అవగాహన కలిగించడం జరిగింది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సైలు నాగరాజు, చాంద్ బాషా, సిబ్బంది పాల్గొన్నారు.
నాటు సారాయి తయారీదారులు అరెస్ట్.. ఎక్సైజ్ సీఐ చంద్రమణి
- Advertisement -
RELATED ARTICLES


