Homeక్రీడలునీళ్లు అందించడం తప్పు కాదు

నీళ్లు అందించడం తప్పు కాదు

- Advertisement -

యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీపై అశ్విన్ వ్యాఖ్య
క్రీడలు:
ఐర్లాండ్‌తో జరిగిన రెండు మ్యాచుల్లో వైభవ్ సూర్యవంశీ వాటర్ బాటిల్స్‌ను అందిస్తూ కనిపించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీనిపై కొంతమంది మాట్లాడుతూ అంత చిన్నపిల్లాడిని, టాప్ క్లాస్ ప్లేయర్‌ను ఇలా వాడుకుంటారా? అని విమర్శలు వచ్చాయి. వీటిపై తాజాగా భారత మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ స్పందించాడు. ‘వైభవ్‌కి తప్పకుండా అవకాశం లభిస్తుంది. కాస్త సమయం పడుతుంది. ఐపీఎల్‌లో అతడు అద్భుత ఆట తీరు కనబరిచాడు. అందులో ఎటువంటి సందేహం లేదు. ఆయన చాలా ప్రత్యేకమైన ఆటగాడు. వైభవ్‌తో మంచినీళ్లు మోయించడంపై ఏవో కొన్ని వ్యాఖ్యలు వినిపించాయి. వాటర్ బాటిల్స్‌ను అందించడంపై ప్రజలు ఎందుకు తప్ప్పుగా ఆలోచిస్తున్నారో అర్థం కావడంలేదు. క్రికెట్‌లో ఇప్ప్పుడు కొత్తగా మార్పులేమీ చేయలేదు. 1990ల్లో, 2000ల్లో నేనూ చెన్నైలో బాల్‌బాయ్‌గా పనిచేశా. అప్ప్పుడు ప్లేయర్లకు వాటర్ బాటిల్స్ అందించినందుకు చాలా సంతోషపడ్డా. మాజీ కెప్టెన్ ధోని, కోహ్లీ…ఇలా చాలా మంది ఆ బాధ్యతలను నిర్వర్తించారు. ఇదేమీ ప్లేయర్‌ను తక్కువ చేయడం కాదు’ అని అశిన్ వివరించాడు.
వైభవ్ అరంగ్రేట్రంపై ఉత్కంఠ…
మరోపక్క వైభవ్ అంతర్జాతీయ అరంగేట్రంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఆయనకు ఐర్లాండ్‌తో అవకాశం రాలేదు. నేటి (బుధవారం) నుంచి ఇంగ్లాండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌ను టీమఇండియా ఆడనుంది. మరి ఈసారైనా ఈ యువ సెన్సేషన్‌ను ఆడిస్తారా? లేదా? అనే దానిపై స్పష్టత రాలేదు. దీనిపై కొంత మంది మాజీలు స్పందిస్తూ…వైభవ్‌కు ఇంకా డ్రెస్సింగ్ అనుభవాలు, అంతర్జాతీయ వేదికల అనుభవం పొందడానికి ఇది చక్కటి అవకాశం లభించిందని, ఆటకు తొందర లేదని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
దీనిపై అశ్విన్ స్పందిస్తూ…
‘రాత్రికి రాత్రే ఎవరూ గొప్ప ఆటగాడిగా మారిపోలేరు. వైభవ్‌ను జట్టుతోపాటు ఉండనివ్వండి. ఆటగాళ్లకు సాయం చేయనివ్వండి. ఆ అనుభవంతో ఎన్నో విషయాలను నేర్చుకోవచ్చు. ఒక్కసారి వైభవ్ జట్టులోకి వస్తే కొనసాగుతూనే ఉంటాడు. గతంలో సచిన్ తెందుల్కర్ నుంచి ఎలాంటి ఆటతీరును చూశామో…వైభవ్ నుంచీ అదే వస్తుందని ఆశిస్తున్నా. 11 మందిలో చోటు దక్కనంత మాత్రాన కుంగిపోవాల్సిన అవసరం లేదు. జట్టు వాతావరణం ఎలా ఉంటుందో అర్థం చేసుకోవడానికి ఇదొక మంచి తరుణం. అతడి సుదీర్ఘమైన కెరీర్‌కు చాలా ఉపయోగపడనుంది. బెంచ్‌పై కూర్చోవడమూ ఓ పాత్ర పోషించినట్లే’ అని అశ్విన్ వ్యాఖ్యానించాడు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు