Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఘనంగా జరిగిన ఎస్బిఐ 71వ బ్యాంకు దినోత్సవ వేడుకలు

ఘనంగా జరిగిన ఎస్బిఐ 71వ బ్యాంకు దినోత్సవ వేడుకలు

- Advertisement -

బ్రాంచ్ మేనేజర్ ఉమామహేశ్వర వర్ధన్
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణములోని ప్రధాన శాఖ ఎస్బిఐ తో పాటు పట్టణంలోని పలు ఎస్బిఐ బ్రాంచ్లు ఘనంగా 71వ బ్యాంకు దినోత్సవం వేడుకలను నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా టౌన్ బ్రాంచ్ లో ఎస్బిఐ మేనేజర్ ఉమామహేశ్వర వర్ధన్, గోపాల్ నాయక్, తదితర బ్యాంకు సిబ్బంది, ఖాతాదారుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం సీనియర్ ఖాతాదారులను ఘనంగా సన్మానించారు. తదుపరి ప్రభుత్వ ఆసుపత్రిలోని 200 మంది రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. తదుపరి మేనేజర్ మాట్లాడుతూ ఎస్ బి ఐ బ్యాంకు ప్రజలకు ఎన్నో రకాలుగా ఉపయోగపడే పథకాలను ప్రవేశపెట్టి వారి జీవనోపాధిలో కీలక పాత్ర వహిస్తుందని తెలిపారు. ఎస్బిఐ వారసత్వాన్ని గౌరవిస్తూ నూతన లక్ష్యంతో అచంచలమైన నిబద్దతతో శాశ్వతమైన గర్వంతో బ్యాంకును ముందుకు తీసుకెళుతున్నామని తెలిపారు. నా బ్యాంకులో వినియోగ దారుడిని మా సేవలో భాగంగా చూస్తున్నామని, టెక్నాలజీ తో కూడిన సేవలను అందిస్తున్నామని తెలిపారు. ప్రతి భారతీయుడకు బ్యాంకర్ ఆఫ్ ఛాయిసుగా నిలవాలన్న ఎస్బిఐ వాగ్దానానికి ప్రతి సంభాషణ నిజమైన ప్రతిబింబంగా ఉండేలా చూస్తున్నామని తెలిపారు. బ్యాంకు సమగ్రతకు అప్రమత్తమైన సంరక్షరిగా తమ ఉద్యోగులు నిలుస్తున్నారని తెలిపారు. మున్ముందు ఎస్బిఐ కు, ఖాతాదారులకు మరిన్ని సేవలను అందిస్తామని వారు భరోసా కల్పించారు. ఎదుగుదల సామర్ధ్యాలతో నిరంతరం పెట్టుబడిలా ఉంటూ ఉత్తమ లక్ష్యాన్ని సాధించే దిశలో ఉన్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పూజిత, ఫణి కుమార్ రెడ్డి, ప్రవీణ్, భాస్కర్, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు