Homeఅంతర్జాతీయంవియత్నాంలో భారతీయ టూరిస్ట్‌ల బోటు బోల్తా.. ఏపీ, తెలంగాణ పర్యటకులు సహా 15 మంది మృతి

వియత్నాంలో భారతీయ టూరిస్ట్‌ల బోటు బోల్తా.. ఏపీ, తెలంగాణ పర్యటకులు సహా 15 మంది మృతి

- Advertisement -

వియత్నాంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. భారతీయ పర్యాటకులతో ప్రయాణిస్తున్న బోటు బోల్తాపడింది. ఈ ఘటనలో 15 మందికిపైగా ప్రాణాలు కోల్పోయినట్టు స్థానిక మీడియా వెల్లడించింది. వీరిలో పలువురు తెలుగువారు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని కడపకు చెందిన శ్రీధర్, కాకినాడకు చెందిన యువకుడు, మచిలీపట్నానికి చెందిన జయశ్రీ అనే మహిళ ఈ ప్రమాదంలో చనిపోయారు. జయశ్రీ భర్త కిషోర్ పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఏపీకి చెందిన మరో నలుగురు గల్లంతయ్యారు. ప్రముఖ పర్యాటక ప్రాంతం ఫు క్వాక్ ద్వీపం సమీపంలో ఈ దుర్ఘటన సంభవించింది. ప్రమాద సమయానికి బోటులో 70 మంది పర్యాటకులు, నలుగురు సిబ్బంది ఉన్నారని అధికారులు తెలిపారు.

ఈ విషయాన్ని వియత్నాంలోని భారత రాయబార కార్యాలయం ధ్రువీకరించింది. ‘‘ఒక అత్యంత బాధాకరమైన సంఘటనలో.. వియత్నాం ఫు క్వాక్ దీవి సమీపంలో కొద్ది గంటల కిందట భారతీయ పర్యాటకులు విహరిస్తున్న పడవ మునిగిపోయింది.. స్థానిక అధికారులు ప్రస్తుతం రెస్క్యూ, సహాయక చర్యలను చేపట్టారు.. ఈ ఘటనకు సంబంధించిన ఖచ్చితమైన సమాచారం సేకరిస్తున్నాం అని ఎంబసీ పేర్కొంది. ప్రమాదం జరిగిన వెంటనే వియత్నాం అధికారులు గాలింపు, సహాయక చర్యలను చేపట్టారు. ప్రమాదంలో 23 మందిని రెస్క్యూ సిబ్బంది రక్షించారు.

బాధితులకు అవసరమైన సమాచారం, సహాయం అందించేందుకు హో చి మిన్ సిటీలోని భారత కాన్సులేట్ జనరల్ ఆఫీసు ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది. +84 36 281 7930, +84 91 552 37 14, +84 33 452 0414 నెంబర్లను సంప్రదించాలని తెలిపింది. అలాగే హనోయిలో కూడా మరో కంట్రోల్ రూమ్ అందుబాటులోకి వచ్చినట్టు తెలిపింది. దీనిని+84 91 308 9165 నంబర్ ద్వారా సంప్రదించాలని సూచించింది.
ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ భారత్‌ నుంచి తమ డీలర్లను ట్రిప్‌కు తీసుకెళ్లింది. మొత్తం 250 మంది వెళ్లగా.. వీరిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 35, తెలంగాణకు చెందిన 40 మంది మొబైల్‌ డీలర్లు ఉన్నారు. ప్రముఖ పర్యటక ప్రాంతం ఫు క్వాక్ దీవి వద్ద మూడు పడవల్లో విహార యాత్ర చేపట్టారు. ఈ క్రమంలోనే శనివారం ఉదయం 10.30 గంటల ప్రాంతంలో ఓ పడవ ప్రమాదవశాత్తూ బోల్తా పడింది. హోన్ మెరుట్ నుంచి హనథోయ్ పోర్టుకు బోటు వెళ్తుండగా ప్రతీకూల వాతావరణం కారణంగానే ప్రమాదం జరిగినట్టు భావిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాదం కారణంగా వియత్నంలో చిక్కుకున్న ఏపీ, తెలంగాణ టూరిస్ట్‌లు సహాయం కోసం భారత ప్రభుత్వానికి విజ్ఞ‌ప్తి చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు