ముంబయి: బరువు నియంత్రణకు కఠినమైన ఆహార నియమాలు, వ్యాయామాలు సత్వర ఫలితాలను ఇచ్చినా, దీర్ఘకాలంలో వాటిని స్థిరంగా ఆచరించడం కష్టం. అందుకే ఒత్తిడితో కూడిన జీవనశైలిలో సులభంగా ఇమిడిపోయే నిలకడైన అలవాట్లను పెంపొందించుకోవడం అత్యుత్తమం. కాలిఫోర్నియా బాదం పప్పులు అలాంటి ఒక ఎంపికగా నిలుస్తాయి. సహజంగానే పోషకాలు అధికంగా ఉండే ఈ బాదం పప్పులు 24 పోషకాలను అందిస్తాయి. ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంచడంలో సహాయపడే సంతృప్తినిచ్చే గుణాలను కలిగి ఉంటాయి, తద్వారా బరువు నియంత్రణ సాధ్యం. బాలీవుడ్ నటి సోహా అలీ ఖాన్ చెప్పినట్లుగా, కాలిఫోర్నియా బాదంపప్పులలో మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వులు పుష్కలంగా ఉంటాయి, అందువల్ల వీటిని మీ భోజనంలో చేర్చుకోవడం ఒక అద్భుతమైన ఆరోగ్యకరమైన కొవ్వు చేర్చుకున్నట్లుగా అనిపిస్తుంది. వీటిని తినడం వల్ల భోజనం తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడాన్ని తగ్గించడంలో కూడా సహాయపడవచ్చు. అలాగే, చక్కెర పానీయాల స్థానంలో ఇన్ఫూయూజ్డ వాటర్ తాగడం, మీకు ఇష్టమైన ఫాస్ట్ ఫుడ్స్‌ను ఇంట్లో తయారు చేసుకున్నవిగా ఎంచుకోవడం, డెజర్ట్‌గా పండ్లను ఎంచుకోవడం వంటివి మీ ఆహారం పోషక నాణ్యతను మెరుగుపరిచే సాధారణ మార్పులు. స్నాక్స్ స్థానంలో పండ్లు, కాలిఫోర్నియా బాదంపప్పుల వంటివి వాడితే, అవి రుచిని, పోషకాలను, నిరంతర శక్తిని అందిస్తాయి.


