- పీపీపీ ప్రాజెక్టులతోనే సత్వర్ఙాóవృద్ధి
- పీపీపీ-వీజీఎఫ్ పాలసీ 1.0 మార్గదర్శకాలు త్వరలో విడుదల
- సీఎం చంద్రబాబు
విశాలాంధ్ర బ్యూరో` అమరావతి: భవిష్యత్తులో వయబిలిటీ గ్యాప్ ఫండింగ్‌తో కూడిన ప్రాజెక్టులే కీలకంగా మారన్నుాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. గతంలో ఆర్థిక సంస్కరణలు, ప్రస్తుతం మౌలిక సదుపాయాల విప్లవం దేశంలో నడుస్తోందని అన్నారు. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతోనే వివిధ రంగాల్లో ప్రాజెక్టులు చేపట్టి వేగంగా అభివృద్ధి చేసేందుకు అవకాశం ఉంటుందని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్రంలో పీపీపీ కింద చేపట్టిన ప్రాజెక్టులు, ప్రభుత్వం చేస్తున్న వ్యయం తదితర అంశాలపై ముఖ్యమంత్రి గురువారం అధికారులతో సమీక్షించారు. పోర్టులు, షిప్ యార్డులు, ఎయిర్ పోర్టులు, పర్యాటక ప్రాజెక్టులు సహా మొత్తం 260 ప్రాజెక్టులను పీపీపీ కింద చేపట్టినట్టు ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. పరిశ్రమలు, మౌలికసదుపాయాలు, పురపాలక, టూరిజం, వైద్య కళాశాలలు, రహదారులు, సౌర విద్యుత్ లాంటి రంగాల్లో రూ.1,23,229 కోట్ల విలువైన ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయని తెలిపారు. దీనిపై స్పందించిన సీఎం… పీపీపీ ప్రాజెక్టులన్నీ స్థిరమైన అభివృద్ధి నమూనాలో చేపట్టి, ఆర్థిక కార్యకలాపాలకు అవకాశం ఉండేలా చూడాలని సూచించారు. వివిధ ప్రాజెక్టులకు కేంద్రం ఇచ్చే అర్బన్ చాలెంజ్ ఫండ్ లాంటి వాటిని కూడా సమర్థంగా వినియోగించుకోవాలని, ముఖ్యంగా పోర్టులు, ఎయిర్‌పోర్టులు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను సమర్థంగా నడిపేందుకు అవసరమైన మెకానిజం సిద్ధం చేయాలని సూచించారు. కోస్టల్ టూరిజం ప్రాజెక్టుల్లో స్థానిక మత్స్యకారులను భాగస్వాములను చేసి… వారికి ప్రయోజనాలు కలిగేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని 21 ప్రధాన దేవాలయాల వద్ద పబ్లిక్ టచ్ పాయింట్ల వద్ద మెరుగైన మౌలిక సదుపాయాలు, ఆర్థిక కార్యకలాపాలకు అవకాశాలు కల్పించాలన్నారు. విజయవాడ, తిరుపతిలోని వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్లకు రూ.178 కోట్ల వీజీఎఫ్‌ను కేంద్రం ఇస్తోందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. మెడికల్ కాలేజీలకు రూ.1,468 కోట్ల వీజీఎఫ్ రానుందని, ఈ ప్రాజెక్టులు చేపట్టిన విధానంపై కేంద్ర ఆర్థిక వ్యవహారాల విభాగం ప్రశంసించిందని అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం-వీజీఎఫ్ పాలసీ 1.0ను వచ్చే కేబినెట్ సమావేశంలో చర్చకు పెట్టాలని, దీనికి సంబంధించి త్వరలోనే మార్గదర్శకాలు విడుదల చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వేర్వేరు విధానాలను అధ్యయనం చేయాల్సిందిగా సూచించారు. 2047 స్వర్ణాంధ్ర లక్ష్యాల మేరకు ఏటా పీపీపీ కింద రూ.8 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని అధికారులు అంచనా వేశారు. విశాఖ, అమరావతి, తిరుపతి ఎకనామిక్ రీజియన్లలో పెద్దఎత్తున మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కింద వీటిని చేపట్టాల్సి రావొచ్చని సీఎంకు వివరించారు. ప్రతి ప్రభుత్వ శాఖ ఆర్థిక ప్రణాళికను తయారు చేసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక ప్రణాళికల ద్వారా ఆదాయ మార్గాలను నిర్దేశించుకోవాలన్నారు. ప్రభుత్వ శాఖలు పెట్టుబడిదారులకు విశ్వాసం కలిగించేలా పీపీపీ ప్రాజెక్టులు చేపట్టాలని, ఏ రంగమైనా ఏపీకి ఫస్ట్ మూవర్ అడ్వాంటేజీ రావాలని ముఖ్యమంత్రి మార్గనిర్దేశనం చేశారు.
ప్రభుత్వ ఆస్తులు సద్వినియోగం
ప్రభుత్వం వద్ద నిరరÆకంగా ఉన్న ఆస్తులను అవకాశాలుగా మలచుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని బస్టాండ్ల వద్ద ప్రభుత్వానికి ఉన్న భూములను వాణిజ్య పరంగా వినియోగించుకునే అవకాశాన్ని పరిశీలించాలని ముఖ్యమంత్రి సూచించారు. పంప్¦ స్టోరేజీ, సౌరవిద్యుత్ ప్రాజెక్టులు కూడా పీపీపీ కింద చేపట్టేందుకు చర్యలు చేపట్టాలన్నారు. గనులు, నెడ్ క్యాప్, పర్యాటకం, లాజిస్టిక్స్ రంగాల్లో భారీగా ఆదాయాన్ని ఆర్జించే అవకాశం ఉందని సీఎం అన్నారు. ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనారిటీ రెసిడెన్షియల్ హాస్టళ్లలో ఉన్న విద్యార్థుల సంఖ్యను రెట్టింపు చేసేందుకు ఆలోచన చేస్తున్నామని, పట్టణ ప్రాంతాల్లో రహదారులకు సమీపంలోనే మినీ టౌన్‌షిప్‌లా రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేసేందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలన్నారు. బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులను నైపుణ్యం ఉన్న మానవ వనరులుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తోందని, దీనికనుగుణంగా ఐఐటీ, ఐఐఎం లాంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో చదివేలా వీరిని తీర్చి దిద్దాలని సీఎం ఆదేశించారు. సమీక్షకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, ఆ శాఖ ఉన్నతాధికారులు పీయూష్ కుమార్, వి.వినయ్ చంద్, రోనాల్డ్ రోస్, పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్ కుమార్, ఐఅండ్ఐ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు తదితరులు హాజరయ్యారు.


