ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ కీలక ప్రకటన
తెహ్రాన్: అమెరికా-ఇరాన్ మధ్య పరస్పర దాడులు, హోర్మూజ్‌లో నౌకల రాకపోకలకు అంతరాయాలతో పశ్చిమాసియాలో పరిస్థితులు ఉద్రిక్తతలు మరింతగా పెరిగాయి. పదిరోజులుగా అమెరికా దాడులు కొనసాగుతున్నాయి. ఇరాన్ డ్రోన్, క్షిపణి నిల్వలు, తీరప్రాంతంలోని నిఘా వ్యవస్థలు, నౌకాదళ సామర్థ్యాలను ధ్వంసం చేస్తోంది. ఈ క్రమంలోనే ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమదేశం అమెరికాతో పూర్తిస్థాయి యుద్ధం చేస్తోందని ప్రకటించారు. ఇరాన్వ్యాప్తంగా అమెరికా దాడుల్ని విస్తరించిందని, ఆ పరిణామాలను దేశ ప్రజలు అంగీకరించాలని ఆయన కోరారు.
మరోవైపు యూఎస్ స్థావరాలను ఇరాన్ టార్గెట్ చేస్తుండటంతో గల్Î దేశాలు ఉక్కిర్ఙిక్కిరి అవుతున్నాయి. కువైట్‌లోని అరిఫ్జాన్ స్థావరంపై తాము ప్రయోగించిన క్షిపణులు…హిమార్స్ రాకెట్ వ్యవస్థను ధ్వంసం చేశాయని ఇరాన్ ప్రకటించింది. తమ మిలిటరీ వ్యవస్థలపై చేసిన దాడికి ఇది ప్రతీకార చర్య అని వెల్లడించింది. అయితే ఇరాన్ ప్రయోగించిన క్షిపణులను తాము అడ్డుకున్నామని యూఎస్ సెంట్రల్ కమాండ్ చెప్పింది. మరోవైపు హోర్మూజ్ వద్ద చమురు ట్యాంకర్‌పై దాడి జరిగిందని యూకే మారిటైమ్ సంస్థ ధ్రువీకరించింది. సిబ్బంది సురక్షితంగా నౌక నుంచి బయటపడ్డారని తెలిపింది. కాగా, రెండు వారాల్లో 100 మంది సైనికులు గాయపడ్డారని పెంటగాన్ వెల్లడించింది. వీరిలో 96 శాతం మంది కోలుకుని తిరిగి విధుల్లోకి వచ్చారని తెలిపింది.
ఇక పూర్తిస్థాయి యుద్ధమే
- Advertisement -
RELATED ARTICLES


