Homeఅంతర్జాతీయంసింధూ జలాల ఒప్పందంలో మార్పులు తప్పవు

సింధూ జలాల ఒప్పందంలో మార్పులు తప్పవు

- Advertisement -


యథావిధిగా పునరుద్ధరణ కుదరదని స్పష్టం చేసిన భారత్
న్యూదిల్లీ:
సింధు జలాల ఒప్పందంపై భారత్ కీలక ప్రకటన చేసింది. గతేడాది పహల్గాం దాడి అనంతరం.á భారత ప్రభుత్వం ఆపరేషన్ సిందూర్‌తో పాక్‌కు గట్టి బుద్ధి చెప్పింది. ఇరు దేశాల మధ్య ఆరు దశాబ్దాలకుపైగా ఉన్న సింధూజలాల ఒప్పందాన్ని నిలిపివేసింది. సింధూ జలాల ఒప్పందంలో మార్పులు తప్పవని స్పష్టం చేసింది. ప్రస్తుతానికి ఆ ఒప్పందం నుంచి వైదొలగాలని ప్రభుత్వం ఆలోచించడం లేదని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. ఏ అంతర్జాతీయ ఒప్పందమైనా దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉన్నట్లు తేలితే…ఒక సార్వభౌమ దేశంగా దానిని రద్దు చేసే హక్కు భారత్‌కు ఉందని పేర్కొన్నాయి. సింధూ జలాల విషయంలో భారత నిర్ణయం పాకిస్థాన్ (Pakistan) చర్యలపైనే ఆధారపడి ఉంటుందన్నాయి. సింధూ జలాల ఒప్పందం ప్రస్తుత రూపంలోనే మళ్లీ అమల్లోకి వచ్చే అవకాశమే లేదని తెలుస్తోంది. ఈ ఒప్పందాన్ని పునరుద్ధరించాల్సి వస్తే…మార్పులు తప్పనిసరి అని భారత ప్రభుత్వం స్పష్టమైన వైఖరి ప్రదర్శిస్తోంది. అదీ పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని విడనాడితేనే సాధ్యమవుతోందని చెబుతోంది. ఈ మేరకు ప్రభుత్వవర్గాలను ఉటంకిస్తూ ఓ జాతీయ మీడియా కథనం పేర్కొంది. ఆ ఒప్పందం నిలిపివేసినప్పటి నుంచి ఉక్కిర్ఙిక్కిరి అవుతోన్న పాక్…సింధూ జలాల్లో తమ వాటా తీసుకుంటే తీవ్రపరిణామాలు తప్పవని ప్రేలాపనలు చేస్తోంది. ఒప్పందం నిలిపివేత వల్ల ఆ దేశంలో నీటికొరత ఏర్పడుతోందని చేస్తోన్న ప్రకటనలను భారత్ ఖండిస్తోంది.
పాక్ తప్పుడు ప్రచారం…
నీటిని నిల్వ చేసే సామర్థ్యాలు లేకనే భారతదేశాన్ని నిందిస్తూ…పాక్ తప్పుడు ప్రచారం చేస్తోందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. భారత్ పదేపదే ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ…ఉగ్రవాదాన్ని అరికట్టడానికి దాయాది దేశం అర్థవంతమైన చర్యలు తీసుకున్న దాఖలాలు ఏవీ లేవన్నాయి. అదీగాక ఐక్యరాజ్యసమితి నిషేధిత జాబితాలో ఉన్న వ్యక్తులు పాక్‌లో బహిరంగ కార్యక్రమాల్లో కనిపిస్తున్నారని ఎండగట్టాయి.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు