Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఇంటి స్థలం పునాది ధ్వంసం.. బాధితుడి ఆవేదన

ఇంటి స్థలం పునాది ధ్వంసం.. బాధితుడి ఆవేదన

- Advertisement -

విశాలాంధ్ర ధర్మవరం;; ధర్మవరంలో దళితుడి ఇంటి స్థలం పునాది ధ్వంసం చేయడం సరైన పద్ధతి కాదు అనిపట్టణానికి చెందిన సాకే శ్రీరాములు తెలిపారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ 2012 సంవత్సరంలో ప్రభుత్వం రెండు సెంట్ల ఇంటి స్థలాన్ని కేటాయించింది అని,. అదే సంవత్సరంలో ఆ స్థలంలో ఇంటి నిర్మాణం కోసం పునాది వేసుకున్నాను అని తెలిపారు. అయితే కుటుంబ పరిస్థితులు, ముఖ్యంగా తండ్రి అనారోగ్య సమస్యల కారణంగా ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేయలేకపోయినట్లు శ్రీరాములు తెలిపారు.ఈ పరిస్థితిని అదనుగా భావించిన పక్కనే ఉన్న వెంకటేష్ (వెంకీ) అనే వ్యక్తి జేసీబీతో వచ్చి తన ఇంటి పునాదిని అక్రమంగా ధ్వంసం చేశాడని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా కులం పేరుతో దుర్భాషలాడుతూ, “నువ్వు ఎవరితో చెప్పుకుంటావో చెప్పుకో” అంటూ బెదిరింపులకు పాల్పడ్డాడని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కేటాయించిన స్థలంలో నిర్మించిన పునాదిని ధ్వంసం చేయడం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. రెవెన్యూ శాఖ అధికారులు, పోలీసు శాఖ వెంటనే స్పందించి పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే జిల్లా కలెక్టర్ , రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్ జోక్యం చేసుకుని తనకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. వెంకీ నుంచి తనకు, తన కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో దౌర్జన్యాలకు పాల్పడిన వ్యక్తి మరోసారి దాడులకు పాల్పడే అవకాశం ఉందని పేర్కొంటూ, ధర్మవరం పోలీసులు తనకు తక్షణమే రక్షణ కల్పించాలని, తన ఫిర్యాదుపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు