Homeజిల్లాలుకర్నూలుప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం

ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం

- Advertisement -

ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంలో టిడిపి నాయకులు

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని టీడీపీ మండల సీనియర్ నాయకులు బసలదొడ్డి ఈరన్న, చిన్నతుంబళం సొసైటీ అధ్యక్షులు కందనాతి నరసప్ప అన్నారు. గురువారం మండల పరిధిలోని కల్లుకుంట, మేకడోణ గ్రామాల్లో మంత్రాలయం టిడిపి ఇంచార్జీ రాఘవేంద్రరెడ్డి, మండల అధ్యక్షులు గవిగట్టు మల్లికార్జున, క్లస్టర్ ఇంచార్జీ మురళి ఆదేశాల మేరకు ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ఇంటింటికీ తిరుగుతూ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయడంలో ప్రభుత్వం కూటమి ప్రభుత్వం విజయవంతం అయిందని కొనియాడారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్లు, తల్లికి వందనం, శ్రీ శక్తి, అన్నదాత సుఖీభవ తదితర పథకాలు పేదలకు వరం లాంటిదని తెలిపారు. ఈ కార్యక్రమంలో బూత్ ఇంచార్జీ నరసప్ప, సొసైటీ సభ్యులు సంజీవయ్య, నాయకులు నరసింహులు, నరసప్ప, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు