దేవి నర్సింగ్ హోమ్ అధినేత్రి డాక్టర్ ఎస్. పద్మావతి
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ఎర్రగుంటలో, పుట్టపర్తి రోడ్, పార్థసారధి నగర్ లో గల దేవీ నర్సింగ్ హోమ్ లో ఆగస్టు మూడవ తేదీ నుండి 5వ తేదీ వరకు మూడు రోజులు పాటు ఉచిత వైద్య శిబిరమును నిర్వహిస్తున్నట్లు దేవీ నర్సింగ్ హోమ్ అధినేత్రి డాక్టర్ ఎస్. పద్మావతి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ వైద్య శిబిరంలో డాక్టర్ ఎస్ పద్మావతి గైనకాలజిస్ట్ తో పాటు జనరల్ సర్జన్ డాక్టర్ రమావత్ సాయి ప్రశాంత్ కూడా వైద్య చికిత్సలను అందిస్తారని తెలిపారు. అన్ని రకములైన జలుబులకు, వివిధ రకాలైన అనారోగ్యాలకు చక్కటి వైద్య చికిత్సలు అందించి, ఆరోగ్యం పట్ల తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించడం జరుగుతుందని తెలిపారు. డాక్టర్ రమావత్ సాయి ప్రశాంత్ లాప్రోస్కోపిక్ సర్జరీలు, ఫైల్స్, ఫిస్టులా, హేమా రాయిడ్స్, ఆపెండిస్ ఫైటిస్, జీర్ణక కోశ వ్యాధులు, కడుపు నొప్పి, కడుపు ఉబ్బరం, సెల్యూ లైటిస్, కొవ్వు గడ్డలు, పిత్తాశయంలో రాళ్లు, దీర్ఘకాలిక గాయాలు, పుండ్లు, హెర్నియా, వర బీజం తదితర సస్య చికిత్సలు చూడబడునని తెలిపారు. మరిన్ని వివరాలకు సెల్ నెంబర్ 9992229649 లేదా 999 2223984 కు సంప్రదించాలన్నారు.
ఉచిత వైద్య శిబిరమును సద్వినియోగం చేసుకోండి..
- Advertisement -
RELATED ARTICLES


