Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఇంటింటా ప్రచారంలో రాష్ట్రంలోనే 5వ స్థానంలో ధర్మవరం..

ఇంటింటా ప్రచారంలో రాష్ట్రంలోనే 5వ స్థానంలో ధర్మవరం..

- Advertisement -

టిడిపి ధర్మవరం నియోజకవర్గ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్
విశాలాంధ్ర ధర్మవరం; రెండేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు చేపట్టిన ఇంటింటా ప్రచార కార్యక్రమంలో ధర్మవరం నియోజకవర్గం రాష్ట్రంలోనే 5వ స్థానంలో నిలిచింది అనిధర్మవరం టిడిపి ఇన్ ఛార్జి పరిటాల శ్రీరామ్ తెలిపారు. ఈ సందర్భంగా పరిటాల శ్రీరామ్ ఆధ్వర్యంలో క్యాడర్ గడిచిన 4రోజుల పాటు విస్తృతంగా జనంలోకి వెళ్లారు. ఇంటింటా తిరుగుతూ కూటమి పాలనలో జరిగిన మంచిని వివరించారు. 25వ వార్డులోని ప్రియాంక నగర్ లో జరిగిన కార్యక్రమంలో శ్రీరామ్ పాల్గొన్నారు. టీడీపీ నాయకులతో కలిసి ఇంటింటికీ వెళ్తూ రెండేళ్లలో జరిగిన అభివృద్ధి, సంక్షేమాన్ని వివరించారు. కొన్ని చోట్ల తమకు అన్ని పథకాలు అందుతున్నాయని ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. మరికొన్ని చోట్ల కొన్ని సమస్యల్ని శ్రీరామ్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన అధికారులతో మాట్లాడి పరిష్కరించాలని సూచించారు. సాంకేతిక కారణాలతో పథకాలు అందకపోతే.. వెంటనే వాటిని అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. నియోజకవర్గంలో 80వేల 726ఇళ్లు ఉండగా.. మూడు రోజులకు 15వేల 965ఇళ్లకు టీడీపీ శ్రేణులు వెళ్లారన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు మరింత చురుగ్గా పాల్గొనాలని సూచించారు. కేవలం చేసిన మంచి గురించి చెప్పడమే కాకుండా ప్రజల సమస్యలను కూడా తెలుసుకోవాలన్నారు. మరోవైపు మెగా డీఎస్సీపై వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలపై శ్రీరామ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ హాయంలో టీచర్ పోస్టులు భర్తీ చేయమంటే కాలయాపన చేసి.. ఇప్పుడు రికార్ట్ టైం మెగా డీఎస్సీని పూర్తి చేస్తే ఏడాదిన్నర తర్వాత అక్రమాలంటూ వైసీపీ నాయకులు ఆరోపణలు చేయడమేంటని నిలదీశారు. ఇందులో ఎలాంటి అక్రమాలు జరగలేదని.. దీనిని నిరూపించేందుకు ఎక్కడికైనా వస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సవాల్ విసిరితే వైసీపీ నాయకులు ఎందుకు స్వీకరించడం లేదన్నారు. కేవలం ఆరోపణలు చేసి బురదజల్లుతామంటూ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని శ్రీరామ్ హెచ్చరించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు