Homeజిల్లాలుశ్రీ సత్యసాయిమానవ అక్రమ రవాణా అరికట్టేందుకు ప్రతిఒక్కరూ నడుం బిగించాలి

మానవ అక్రమ రవాణా అరికట్టేందుకు ప్రతిఒక్కరూ నడుం బిగించాలి

- Advertisement -

న్యాయవాదులు
విశాలాంధ్ర -ధర్మవరం; మానవ అక్రమ రవాణా అరికట్టేందుకు ప్రతిఒక్కరూ నడుం బిగించాలని న్యాయవాదులు బాలసుందరి, బాబా, నరసింహమూర్తి, శంకరయ్యలు తెలిపారు. పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం కార్యక్రమంలో భాగంగా మండల లీగల్ సర్వీసెస్ సెంటర్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా మహిళలు, పురుషులు, పిల్లలతో సహా మిలియన్ల మంది మానవ అక్రమ రవాణాకు బాధితులు అవుతున్నారని ఇలాంటి వాటికి గురికాకుండా చూడాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందన్నారు. మానవ అక్రమ రవాణా గురించి విద్యార్థులకు అవగాహన కల్పించడంతోపాటు దానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన ఆవశ్యకత గురించి ప్రజలను చైతన్య పరచడం ముఖ్య ఉద్దేశమన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు