Homeజిల్లాలుకర్నూలుకర్నూలు జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలి

కర్నూలు జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలి

- Advertisement -

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : కర్నూలు జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలంటూ జిల్లా కమిటీ పిలుపు మేరకు సోమవారం స్థానిక మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిపిఐ – రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి వీరేష్, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఆంజనేయ, కమిటీ సభ్యులు రాజు, ఏఐవైఎఫ్ తాలూకా అధ్యక్షులు జాఫర్ పటేల్ మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ లో కురిసిన అరకొర వర్షాలకు జిల్లాలో రైతులు లక్షలాది ఎకరాల్లో పత్తి, కంది, వేరుశెనగ, ఉల్లి, ఆముదము, జొన్న, సజ్జ తదితర పంపలు వేయడం జరిగిందన్నారు. విత్తనం వేసిన తరువాత రెండు నెలలు నుండి తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల పంటలు మొలక దశలోనే ఎండిపోయాయన్నారు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. ప్రభుత్వం స్పందించి జిల్లాలోని అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని, పంట నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు 50 వేలు ఇవ్వాలన్నారు. రైతులు బ్యాంకులో తీసుకున్న పంట రుణాలను 2 లక్షలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రైతులు ప్రభుత్వానికి చెల్లించిన ప్రీమియం డబ్బులు రైతులకు చెల్లించి, ప్రభుత్వమే పంటల ప్రీమియం డబ్బులు చెల్లించి, ఉచిత పంటల బీమా అమలు చేయాలన్నారు. కరువు పరిస్థితి దృష్ట్యా రైతు కుటుంబాలకు 10 నెలల పాటు నెలకు 20 వేలు కరువు పింఛన్లు మంజూరు చెయ్యాలంటూ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహసీల్దార్ వలిబాషాకు అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల సహాయ కార్యదర్శులు కుమ్మరి చంద్ర, తిక్కన్న, నాయకులు నాగరాజు, నరసింహులు, రామాంజనేయులు, హనుమంతు, నాగేంద్ర, గోపాల్, లక్ష్మన్న, రమేష్, వీరేష్, రైతులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు