Homeజాతీయంరోడ్లపై పాదచారులు నడిచేందుకు దారివ్వండి: సుప్రీం కోర్టు

రోడ్లపై పాదచారులు నడిచేందుకు దారివ్వండి: సుప్రీం కోర్టు

- Advertisement -

దేశవ్యాప్తంగా రహదారులపై పాదచారుల భద్రతను నిర్ధారించడానికి మరియు వారి హక్కులను పరిరక్షించడానికి సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది. దేశంలోని ప్రతి రహదారిపై పాదచారులు ఎలాంటి భయం లేకుండా సురక్షితంగా నడిచేందుకు ప్రత్యేక స్థలాన్ని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. పాదచారుల కోసం కేటాయించిన ఈ ప్రదేశం ఆక్రమణలకు గురికాకుండా, సాధారణ వాహనాల మార్గం నుంచి స్పష్టంగా వేరు చేసి గుర్తించాలని పేర్కొంది. జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ అలోక్ అరాధేలతో కూడిన ధర్మాసనం విచారణ చేపడుతూ, కేంద్రం తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ కేఎం నటరాజ్‌కు పలు సూచనలు చేసింది. నిపాదచారుల మార్గాల కోసం భారీ నిధులు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. తాడు లేదా ఇతర తాత్కాలిక గుర్తులతోనైనా రహదారిపై పాదచారుల మార్గాన్ని స్పష్టంగా వేరు చేయాలి” అని స్పష్టం చేసింది. సంబంధిత శాఖలకు అవసరమైన ఆదేశాలు ఇవ్వాలని కేంద్రానికి సూచిస్తూ, తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు